దెబ్బకి జగన్ పరువంతా పోయింది..! “నిండా మునిగిపోయాడు”

కొద్ది రోజుల క్రితం ఆ భూముల్లో పేదలకు ఇల్లు ఇస్తున్నారని దీని వెనక వైసీపీ భారీ కుంభకోణం ఉందని విపక్షాలు గొంతెత్తి నినదించాయి. 10 లక్షలు ఖరీదు చేసే భూమి కి 40 లక్షలకు పైగా చెల్లిస్తున్నారని…. ఇందులో చాలా పెద్ద కుంభకోణం జరిగిందని.. ప్రభుత్వానికి భూములను వైసీపీ నేతలు వారి జేబులు నింపుకునేందుకు అమ్ముతున్నారు అని ఎన్నో ఆరోపణలు వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని ఆవ భూముల విషయంలో ఇలా చాలా పెద్ద చర్చ […]

Written By: Navya, Updated On : August 18, 2020 11:17 am
Follow us on

కొద్ది రోజుల క్రితం ఆ భూముల్లో పేదలకు ఇల్లు ఇస్తున్నారని దీని వెనక వైసీపీ భారీ కుంభకోణం ఉందని విపక్షాలు గొంతెత్తి నినదించాయి. 10 లక్షలు ఖరీదు చేసే భూమి కి 40 లక్షలకు పైగా చెల్లిస్తున్నారని…. ఇందులో చాలా పెద్ద కుంభకోణం జరిగిందని.. ప్రభుత్వానికి భూములను వైసీపీ నేతలు వారి జేబులు నింపుకునేందుకు అమ్ముతున్నారు అని ఎన్నో ఆరోపణలు వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని ఆవ భూముల విషయంలో ఇలా చాలా పెద్ద చర్చ జరిగింది.

Also Read: కారులో ముగ్గురు ఉండగానే తగలబెట్టేశాడు… విజయవాడలో దారుణం!

కానీ అధికార పార్టీ నేతలు ప్రభుత్వ అధికారులు చెప్పింది ఏమిటంటే… “అవి ఆవ భూములు కావు…. పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఈ భూములను ప్రత్యేకంగా ఎంపిక చేశాం. అవసరమైతే ఎత్తు పెంచుతాము.. మట్టి పోయిస్తాము..” అన్నారు. ఈ విషయమై ప్రభుత్వ శాఖల మధ్య తీవ్ర గందరగోళం నెలకొంది అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యవహారం కోర్టులో ఉంది. ఇక ఈ సమయంలో జగన్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. వారి పరువు అంతా గోదావరిలో కొట్టుకుపోయింది.

గోదావరికి వరద వచ్చింది. ఆ భూముల్లో కి పెద్ద ఎత్తున నీళ్లు వచ్చేసాయి. మోకాలిలోతు కొన్ని చోట్ల.. మనిషి నిలువెత్తు మునిగిపోయే కొన్ని చోట్ల నీళ్లు దర్శనమిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసిన భూముల్లోనే ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు అసలు ఆవ భూములే తమ లిస్టు లో లేవని…. అవి ఆవ భూములు భూములు కాదని వారంతా ఒక్కసారిగా నోట్లో మూసేశారు.

Also Read: కేసీఆర్ సై అంటున్నాడు..! మరి జగన్ నై అంటాడా…?

“పేదలంటే మీకు అంత చులకన అయిపోయిందా….? అసలు ఇలాంటి చోట్ల పేదలు ఎలా ఉండగలుగుతారు? నగరాలకు పట్టణాలకు దూరంగాగానే కాకుండా ఆఖరి గ్రామాలకు సైతం దూరంగా భూములను కొన్ని కొన్ని చోట్ల ఎంపిక చేశారు. వాటిల్లో చాలావరకు ముంపు ప్రాంతాలు ఉన్నాయని ఇప్పుడు విపక్షాలు మరింత తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.. ఒక్క గోదావరి నీటి ముంపుతో జగన్ ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలు…. ఆవ భూములేనని అంతా వాదిస్తున్నారు. దెబ్బకు నిండా మునిగిపోవడంతో ఒక్కసారిగా ప్రభుత్వం ప్రజల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అన్నది బయటపడింది…. వారి పరువు అంతా పోయింది.