దారుణం: వందల కోతులపై అమానుషం

కోతులు.. హనుమంతుడి ప్రతిరూపాలుగా హిందువులు కొలుస్తారు. వాటి అడవుల్లోకి మనషులు దూరడంతో ఆహారం కరువై ప్రస్తుతం అవి మన జనావాసాల్లోకి వచ్చిపడుతున్నాయి. ‘కోతులు వాపస్ పోవాలి.. వానలు వాపస్ రావాలి’ అని నినదిస్తున్నా కూడా చాలా గ్రామాలు, పట్టణాల్లో ఇప్పుడు కోతుల బెడద ప్రధాన సమస్యగా మారింది. ఈ క్రమంలోనే కొందరు దుర్మార్గులు కోతుల విషయంలో అమానుషంగా ప్రవర్తించారు. కోతులకు విషం ఇచ్చి వాటిని గోనెసంచుల్లో కుక్కి చావబాదారు. వాళ్ల దాడులకు చాలా కోతులు చనిపోయాయి. కొన […]

Written By: NARESH, Updated On : July 29, 2021 6:33 pm
Follow us on

కోతులు.. హనుమంతుడి ప్రతిరూపాలుగా హిందువులు కొలుస్తారు. వాటి అడవుల్లోకి మనషులు దూరడంతో ఆహారం కరువై ప్రస్తుతం అవి మన జనావాసాల్లోకి వచ్చిపడుతున్నాయి. ‘కోతులు వాపస్ పోవాలి.. వానలు వాపస్ రావాలి’ అని నినదిస్తున్నా కూడా చాలా గ్రామాలు, పట్టణాల్లో ఇప్పుడు కోతుల బెడద ప్రధాన సమస్యగా మారింది.

ఈ క్రమంలోనే కొందరు దుర్మార్గులు కోతుల విషయంలో అమానుషంగా ప్రవర్తించారు. కోతులకు విషం ఇచ్చి వాటిని గోనెసంచుల్లో కుక్కి చావబాదారు. వాళ్ల దాడులకు చాలా కోతులు చనిపోయాయి. కొన ఊపిరితో ఉన్న వాటిని ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణం కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లా బెలూర్ తాలూకా చౌడనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది.

రోడ్డుపక్కన ఈ ఉదయం స్థానిక యువకులు కొన్ని గోనెసంచులను రోడ్డు పక్కన గుర్తించారు. వాటిని తెరిచి చూడగా కోతులు కన్పించాయి. కొన్ని సంచుల్లో ఉన్న కోతులు ఇప్పటికే మరణించగా.. మరికొన్ని తీవ్ర గాయాలతో అపస్మారక స్తితిలో కనిపించాయి. 30 కోతులు చనిపోగా.. మరో 20 గాయపడ్డాయి. 18 కోతులకు నీళ్తుతాగించగా కోలుకున్నాయి. గాయపడ్డ వాటిని వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు.

ఇక ఈ దారుణాన్ని ప్రముఖ నటుడు రణ్ దీప్ హుడా ట్విట్టర్ లో షేర్ చేసి ఆవేదన వ్యక్తం చేశారు. కోతులను చంపిన దుర్మార్గులను శిక్షించాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.