Homeఅంతర్జాతీయంPM Modi Global Popularity: ప్రపంచ నాయకుడిగా మోదీ.. రికార్డు స్థాయిలో ప్రజాదరణ!

PM Modi Global Popularity: ప్రపంచ నాయకుడిగా మోదీ.. రికార్డు స్థాయిలో ప్రజాదరణ!

PM Modi Global Popularity: నరేంద్ర దామోదర్‌ దాస్‌ మోదీ.. ప్రతీ భారతీయుడికి సుపరిచితమైన వ్యక్తి.. అందరూ మోదీగా పిలుచుకునే నేత. భారత రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని వరుసగా మూడుసార్లు ప్రధానిగా ఎన్నికయ్యారు. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ రికార్డును సమం చేశారు. ఇక 4,078 రోజులు ప్రధానిగా పనిచేసి ఇందిరాగాంధీని వెనక్కు నెట్టారు. దేశంలో ఎక్కువ కాలం పనిచేసిన రెండో ప్రధానిగా గుర్తింపు పొందారు. ఇక.. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో మోదీ.. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా రికార్డుస్థాయి మద్దుతు పొందారు. అమెరికా కేంద్రంగా పనిచేసే ఆధారిత మార్నింగ్‌ కన్సల్టెంట్‌ సంస్థ జూలై 4 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించిన సర్వేలో మోదీ 75% ప్రజాదరణతో అగ్రస్థానంలో నిలిచారు. ఈ సర్వేలో 18% వ్యతిరేకత, 7% తటస్థ ఓట్లు రాగా, ఆయన నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని, భారతీయులలో విశ్వాసాన్ని పొందింది.

Also Read: భారత్‌ వ్యూహాత్మక దౌత్యం.. యూకే ట్రేడ్‌ డీల్‌.. అమెరికాకు షాక్‌!

అభివృద్ధి, భద్రతలో మోదీ ముద్ర..
మోదీ నాయకత్వం భారతదేశ అభివృద్ధి, జాతీయ భద్రతలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆర్థిక సంస్కరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రోడ్లు, రైలు మార్గాలు, కొత్త ప్రాజెక్టులు భారత్‌ను ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపాయి. పేదలకు ఉచిత రేషన్, కరోనా వ్యాక్సిన్‌ వంటి సామాజిక సంక్షేమ కార్యక్రమాలు పేద, మధ్యతరగతి ప్రజల్లో ఆయనకు ఆదరణను పెంచాయి. జాతీయ భద్రత విషయంలో ఆయన నిర్ణయాలు, ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు భారతీయులలో విశ్వాసం నింపాయి. మొత్తంగా మోదీ నాయకత్వం ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో సమతుల్య విధానాలను అనుసరిస్తోంది.

టెక్నాలజీలో స్వయం సమృద్ధి..
మోదీ పాలనలో టెక్నాలజీ రంగంలో భారత్‌ గణనీయమైన పురోగతి సాధించింది. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’, ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ వంటి కార్యక్రమాలు దేశీయ ఉత్పాదకతను, ఆవిష్కరణలను ప్రోత్సహించాయి. ప్రపంచంలో కొత్త టెక్నాలజీలను భారత్‌లో అమలు చేయడం, డిజిటల్‌ ఇండియా వంటి పథకాలు యువతలో ఆయనపై విశ్వాసాన్ని పెంచాయి. ఈ విధానాలు భారత్‌ను ఆర్థికంగా, సాంకేతికంగా బలోపేతం చేశాయి.ఇవి గ్లోబల్‌ ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో నిలవడానికి దోహదపడ్డాయి. 11 ఏళ్లుగా అవినీతి రహిత పాలన, ప్రజలతో ఆయన సన్నిహిత సంబంధం ఈ విజయానికి కారణం.

Also Read: కోట్ల రూపాయల జీతాలు.. నెంబర్ వన్ కంపెనీలు.. వీళ్లు మామూలోళ్ళు కాదు..

టాప్‌ టెన్‌ ర్యాంకులు ఇవీ..

నరేంద్ర మోదీ (భారత్‌) – 75%
లీ జే మ్యుంగ్‌ (దక్షిణ కొరియా) – 59%
జేవియర్‌ మిలీ (అర్జెంటీనా) – 57%
మార్క్‌ కార్నీ (కెనడా) – 56%
ఆంథోనీ ఆల్బనీస్‌ (ఆస్ట్రేలియా) – 54%
క్లాడియా షీన్‌బామ్‌ (మెక్సికో) – 53%
కరిన్‌ కెల్లర్‌–సుట్టర్‌ (స్విట్జర్లాండ్‌) – 48%
డొనాల్డ్‌ ట్రంప్‌ (అమెరికా) – 44%
డొనాల్డ్‌ టస్క్‌ (పోలాండ్‌) – 41%
జార్జియా మెలోనీ (ఇటలీ) – 40%

ఈ సర్వేలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 44% ప్రజాదరణతో 8వ స్థానంలో నిలిచారు, ట్రంప్‌తో పోలిస్తే మోదీ ఆదరణ గణనీయంగా ఎక్కువగా ఉండటం ఆయన విశ్వసనీయతను సూచిస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular