https://oktelugu.com/

మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్!

గతంలో లాక్ డౌన్ విషయంలో స్పందించి కీలక వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరో సారి లాక్ డౌన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ పొడిగిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలకు పలు సూచనలు చేసారు. సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతున్న కరోనా జిహాద్‌పై ఒవైసీ మాట్లాడుతూ… ‘ఇటువంటి పనులకు పాల్పడుతున్న వారు దేశాన్ని బలపర్చట్లేదన్నారు. జనవరి 1 నుండి 15 వరకు 15 లక్షల మంది దేశానికి వచ్చారు కానీ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 11, 2020 / 06:40 PM IST
    Follow us on

    గతంలో లాక్ డౌన్ విషయంలో స్పందించి కీలక వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరో సారి లాక్ డౌన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ పొడిగిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలకు పలు సూచనలు చేసారు. సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతున్న కరోనా జిహాద్‌పై ఒవైసీ మాట్లాడుతూ… ‘ఇటువంటి పనులకు పాల్పడుతున్న వారు దేశాన్ని బలపర్చట్లేదన్నారు.

    జనవరి 1 నుండి 15 వరకు 15 లక్షల మంది దేశానికి వచ్చారు కానీ జమాత్ కు హాజరైన వారినే ఎత్తి చూపుతున్నారన్నారు. దేశంలో మార్చ్ 3న స్క్రీనింగ్ ప్రారంభించారు దానికి బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. 6 లక్షల మందిని శిబిరంలో ఉంచామని కేంద్రం చెబుతోంది వారిని సామాజికంగా ఎలా దూరంగా ఉంచుతారన్నారు. ఒకవేళ ప్రభుత్వాలు లాక్ డౌన్ ను పొడిగిస్తే పేదల ఖాతాల్లో 5వేల రూపాయలు జమచేయాలన్నారు. మోదీ నాకు కూడా ప్రధానమంత్రే పేదలు పడుతున్న ఇబ్బందుల పట్ల దృష్టిపెట్టాలని నేను కోరుతున్నానని అన్నారు. రాష్ట్రంలో ఎవ్వరూ ఆకలితో ఉండడానికి వీల్లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను’ అని తెలిపారు. ముస్లిం లు సామజిక దూరం పాటించాలని సూచించారు. ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలన్నారు. డాక్టర్లపై రాళ్లు రువ్వటం సరికాదన్నారు. వారు మనకోసం ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్నారని అన్నారు.