నాటకీయ పరిణామాల నేపథ్యంలో, పలు వివాదాల మధ్య శనివారం ఏపీ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ కనగరాజ్ ప్రస్తుతం అమలులో ఉన్న లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని దుమారం మరోవంక చెలరేగింది.
ఇంకా నియామకం జరగకుండానే ఆయన నేరుగా చెన్నై నుండి విజయవాడకు ఏ విధంగా వచ్చారని, ఎవ్వరు అనుమతులు ఇచ్చారని అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తున్నది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిబంధనల ప్రకారం రాష్ట్రంలోకి పొరుగు రాష్ట్రాల నుండి ఎవరైనా ప్రవేశించాలి అంటే ముందుగా రెండు వారల పాటు స్వీయ నిర్బంధంలో ఉండవలసిందే. పైగా కరోనా పరీక్షా జరిపించుకోవలసిందే.
హైదరాబాద్ లో ఉన్న ఉద్యోగులు, విద్యార్హ్దులను నగర పోలీసులు అన్ని పరీక్షలు జరిపించి, ఏపీలోని స్వస్థలలోకి వెళ్ళడానికి అనుమతి పత్రాలు ఇచ్చి పంపినా వారిని అనుమతించకుండా ఏపీ పోలీసులు నన రసభ చేయడం అందరికి తెలిసిందే. మరో రాష్ట్రంలో చేయించుకున్న వైద్య పరీక్షలను ఏపీ అధికారులు విశ్వసించడం లేదు.
వైద్య పరీక్షలలో నెగటివ్ అని తేలిన సరే, వారు రెండు వారాలపాటు స్వీయ నిర్బంధంలో ఉండవలసిందే అని స్వయంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు పర్యాయాలు స్పష్టం చేశారు. అటువంటప్పుడు జస్టిస్ కనగరాజ్ ఏ విధంగా ఎపిలోకి రాగలిగారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అంటే నీయాకంకన్నా ముందే ఆయనకు తెలిపి, ఆయనను విజయవాడ నగరంలోకి రప్పించినట్లు తెలుస్తున్నది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో రావడానికి ఎవ్వరు అనుమతి ఇచ్చారు. నిబంధనల ప్రకారం విజయవాడ పోలీస్ కమీషనర్ అనుమతి ఇవ్వవలసి ఉంటుంది. విజయవాడ కమీషనర్ ద్వారకా తిరుమలరావు కూడా ఆయనను కలిసిన వారిలో ఉన్నారు.
నిబంధనలు అంటిని తుంగలో తొక్కి ఆయన విజయవాడకు వచ్చారా? లాక్ డౌన్ అమలు పట్ల ఏపీ ప్రభుత్వం, అధికార పార్టీ నేతల నిర్లక్ష్య ధోరణికి ఈ ఉదంతం అద్దం పడుతున్నదా అనే అనుమానాలు చెలరేగుతున్నాయి.
ఇలా ఉండగా, వైఎస్సార్సీపీ నేత, ఎంపీ విజయ సాయి రెడ్డి లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా పర్యటనలు జరుపుతున్నారని, భౌతిక దూరం కూడా పాటించకుండా గుంపులు, గుంపులుగా జనాన్ని తిప్పుకొంటున్నరని అంటూ శాసనమండలిలో టిడిపి విప్ బుద్ధా వెంకన్న డిజిపి గౌతమ్ సవాంగ్ కువ్రాసిన లేఖలో ఆరోపణలు చేశారు.
ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు ప్రజలు వెళ్లొద్దని పోలీస్ అధికారులు చెప్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారిని సైతం వెనక్కి పంపుతున్నారు. కానీ విజయ సాయి రెడ్డి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తిరుగుతున్నారని విమర్శించారు.
టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బాధితుల సహాయం కోసం కారులో నలుగురితో వచ్చినా అరెస్టు చేసి, కేసు పెట్టి, కారు స్వాధీనం చేసుకున్నారని, మరి విజయ సాయి రెడ్డి బహిరంగంగా వందల మంది సమక్షంలో సభలు నిర్వహిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంటూ డిజిపిని నిలదీశారు.
ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించేలా వ్యవహరించిన విజయసాయి రెడ్డిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.