Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం లో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత ఎదుర్కొంటున్న పరిస్థితులనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చవి చూస్తున్నారు. ఈ కుంభకోణం కేసులో అభియోగాలు ఎదుర్కొని.. గత కొద్దిరోజులుగా ఢిల్లీలోని తీహార్ జైల్లో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అరవింద్ కేజీలు వాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కూడా ఆ జైలుకే ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తరలించారు.. ఇప్పటికే ఆ జైల్లో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత విచారణ ఖైదీగా ఉన్నారు.
సోమవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీలోని హౌస్ అవన్నీ కోర్టు జ్యుడిషియల్ కస్టడీని ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. దీంతో ఆయనను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కోర్టు నుంచి నేరుగా తీహారు జైలుకు పంపించారు. ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల విచారణ ముగియడంతో.. ఆయనను జ్యూడిషియల్ కస్టడీ కి పంపించాలని ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కోర్టును కోరారు. అంతేకాదు లిక్కర్ పాలసీలో చోటుచేసుకున్న మని లాండరింగ్ కేసు విచారణకు అరవింద్ కేజ్రివాల్ సహకరించడం లేదని ప్రకటించింది. ప్రశ్నలకు సంబంధం లేని సమాధానాలు ఇస్తున్నారని.. కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేజ్రీవాల్ తన డిజిటల్ పరికరాల పాస్ వర్డ్స్ ఇవ్వడం లేదని.. తెలియదు అనే సమాధానాలు ఎక్కువగా ఇస్తున్నారని ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కోర్టు ఎదుట స్పష్టం చేశారు. ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల వాదనతో ఏకీభవించిన కోర్టు అరవింద్ కేజ్రీవాల్ కు ఏప్రిల్ 15 వరకు జ్యూడిషియల్ కస్టడీ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
అరవింద్ కేజ్రీవాల్ ను జైలుకు తరలించిన నేపథ్యంలో ఆయనకు కొన్ని మందులు అందుబాటులో ఉంచాలని ఆయన న్యాయవాది కోర్టును కోరారు. అలాగే జర్నలిస్టు నీరజ్ చౌదరి రచించిన రామాయణం, హౌ ప్రైమ్ మినిస్టర్ డిసైడ్స్, మహాభారత అనే మూడు పుస్తకాలను ఆయనకు ఇవ్వాలని విన్నవించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో అరవింద్ కేజ్రీవాల్ ఉన్న నేపథ్యంలో ఆయనకు ప్రత్యేకమైన ఆహారాన్ని ఇవ్వాలని విన్నవించారు. మరవైపు అరవింద్ కేజ్రీవాల్ లాకెట్, టేబుల్ కుర్చీ కావాలని కోర్టును అడిగారు. కాగా, ఢిల్లీ ముఖ్యమంత్రిని మార్చి 21న ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. 28 వరకు కోర్టు ఆదేశాలతో తమ కస్టడీలో ఉంచుకున్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ అభ్యర్థన మేరకు ఆయన కస్టడీని కోర్టు ఏప్రిల్ ఒకటి వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలోనే కోర్టు గడువు తేదీని ఏప్రిల్ 15 వరకు పెంచింది. విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి సహకరించకపోవడంతో.. అదే విషయాన్ని కోర్టు దృష్టికి ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం తీసుకెళ్లింది. అతడు వాడుతున్న ఐఫోన్ పాస్ వర్డ్ చెప్పడం లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు చేసేందుకు అతడి కస్టడీని కోర్టు మరింత పెంచింది.
ఇక కొద్ది రోజుల క్రితం ఆప్ నేత సంజయ్ సింగ్ ను జైల్ నెంబర్ 2 నుంచి జైల్ నెంబర్ 5కి మార్చారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రిని జైల్ నెంబర్ 1 లో ఉంచారు. సత్యేంద్రజైన్ ను జైల్ నెంబర్ 7 లో ఉంచారు. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి కి ఏ నెంబర్ కేటాయిస్తారనేది తెలియ రాలేదు. తీహార్ కాంప్లెక్స్లో మొత్తం తొమ్మిది జైళ్ళు ఉన్నాయి. 12,000 మంది ఖైదీలు అందులో శిక్ష అనుభవిస్తున్నారు.