జనతా కర్ఫ్యూ పిలుపు ఇచ్చినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అవహేళన చేస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతూ ఉండడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో ప్రపంచ ప్రజలకు భారత ప్రజల సమిష్టి సంసిద్ధతను తెలపడం కోసం ఇదొక్క గొప్ప అవకాశమని, విశేషంగా కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పే సందర్భం అని కొనియాడారు.
విపత్కర పరిస్థితులలో దేశ ప్రజలు అందరు ఒకటిగా స్పందించ వలసిన తరుణంలో ఇటువంటి వాఖ్యలు చేసేవారిని `వెధవలు’ అంటూ కేసీఆర్ ఖండించ్చారు. అటువంటి వారిపై తగు చర్యలు తీసుకోమని డిజిపిని ఆదేశించారు.
రేపు సాయంత్రం ఐదు గంటలకు చప్పట్లు కొట్టి వైద్య సిబ్బందికి సంఘీభావం తెలుపుతూ చప్పట్లు కొట్టాలన్నారని కొందరు. అయితే ప్రధాని పిలుపును కొంతమంది సోషల్ మీడియాలో అవహేళన చేస్తూ పోస్టులు పెడుతున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
‘ఏది ఏమైనా ఆయన మన ప్రధానమంత్రి.. ఆయనను మనం గౌరవించుకోవాలి. మన మంచి కోసమే మోడీ పని చేస్తున్నారు. ఆయనను కించపరిచేలా పోస్టులు పెడితే అరెస్టులు తప్పవు’ అని హెచ్చరించారు.
కరోనా వైరస్‌ని ఐక్యతతో ఎదుర్కొంటామని ప్రపంచానికి చాటడానికి, కష్ట సమయంలో ధైర్యంగా మన కోసం సేవలు అందిస్తున్న వైద్య, పోలీస్.. ఇతర సిబ్బందికి సంఘీభావం తెలిపేందుకు రేపు ఐదు గంటలు చప్పట్లు కొట్టాలని మోడీ పిలుపునిచ్చారని ఆయన మద్దతు తెలిపారు. తాను కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొడతానని చెప్పారు.