https://oktelugu.com/

తెలంగాణలో కమల వికాసం.. ఏపీ బీజేపీపైనే ఒత్తిడి!

ఇద్దరు కొత్త అధ్యక్షులే. తెలంగాణలో ‘బండి’ దూసుకుపోయింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు బాట పట్టింది. బలమైన అధికార టీఆర్ఎస్ ను మట్టికరిపించింది. అరవీర భయంకరులకు సాధ్యం కానిది.. యువకుడు, దూకుడుకు మారుపేరైన బండి సంజయ్ నిరూపించారు. టీఆర్ఎస్ కంచుకోటను బద్దలుకొట్టారు. ఓటమి ఎరుగని ట్రబుల్ షూటర్ హరీష్ ను ఓడించారు. సీఎం కేసీఆర్ ను ఢీకొట్టారు. Also Read: ఏపీలో సోము వీర్రాజు కూడా మొదలుపెట్టేశాడట! దుబ్బాకలో బీజేపీ విజయం తెలంగాణ రాజకీయాలనే షేక్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 11, 2020 / 06:03 AM IST
    Follow us on

    ఇద్దరు కొత్త అధ్యక్షులే. తెలంగాణలో ‘బండి’ దూసుకుపోయింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు బాట పట్టింది. బలమైన అధికార టీఆర్ఎస్ ను మట్టికరిపించింది. అరవీర భయంకరులకు సాధ్యం కానిది.. యువకుడు, దూకుడుకు మారుపేరైన బండి సంజయ్ నిరూపించారు. టీఆర్ఎస్ కంచుకోటను బద్దలుకొట్టారు. ఓటమి ఎరుగని ట్రబుల్ షూటర్ హరీష్ ను ఓడించారు. సీఎం కేసీఆర్ ను ఢీకొట్టారు.

    Also Read: ఏపీలో సోము వీర్రాజు కూడా మొదలుపెట్టేశాడట!

    దుబ్బాకలో బీజేపీ విజయం తెలంగాణ రాజకీయాలనే షేక్ చేసింది. తిరుగులేదనుకుంటున్న టీఆర్ఎస్ ముందరికాళ్లకు బంధం వేసింది. 2024 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ధీమాగా వెళదామనుకున్న టీఆర్ఎస్ కు గుబులు పుట్టించింది. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలు అంత ఈజీ కాదని నిరూపించింది.

    దుబ్బాక విజయం ఏపీ బీజేపీని ఒత్తిడిలోకి నెట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక కరీంనగర్ కార్పొరేటర్ నుంచి కరీంనగర్ ఎంపీగా  బండి సంజయ్ ఎదిగారు. దూకూడైన నేతగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సత్తాచాటారు. ఇప్పుడే అదే ఫైర్ బ్రాండ్ ఏపీలో అధ్యక్షుడు.. బండికి సరితూగేలా సోము వీర్రాజు సైతం ఏపీ బీజేపీలో అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. మరి బండి నిరూపించుకోవడంతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఇప్పుడు ఒత్తిడి పెరిగింది.

    ఇప్పటివరకు సోము వీర్రాజు ఏ ఎన్నికను అధ్యక్ష హోదాలో ఎదుర్కోలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో అవి జరుగుతాయో లేదో తెలియదు. ఇక తిరుపతి ఎంపీ స్థానానికి మాత్రమే ఇప్పుడు ఏపీలో ఉప ఎన్నికలు ఉన్నాయి.

    వైసీపీకి చెందిన తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ కరోనా కారణంగా వచ్చిన ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం ఏపీలో జనసేనతో కలిసి బీజేపీ పొత్తు పెట్టుకొని వెళ్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరుపార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పుకొచ్చాడు. కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు. అసలు ఎప్పుడు జరుగుతాయో కూడా తెలియదు. కరోనా తగ్గిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ముందు రానుంది.

    Also Read: ఏపీలోనూ బీజేపీ బలపడనుందా.?

    తిరుపతి బరిలో నిలిచేందుకు బీజేపీ ఆల్‌రెడీ సై అంటోంది. అయితే.. ఈ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఇరు పార్టీలు కలిసి పోటీచేస్తే వాటికి ఇవే ఫస్ట్‌ ఎలక్షన్స్‌ అని చెప్పాలి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలపై దాడులు జరగడం, తిరుమలలో ముఖ్యమంత్రి జగన్ డిక్లరేషన్ వివాదం వంటివి తమకు కలిసి వస్తాయని బీజేపీ గట్టిగా నమ్ముతోంది. ఎందుకంటే బీజేపీ వీటిపై బాగానే పోరాడింది. సోము వీర్రాజు వీరోచితంగా పోరాడారు. ప్రజల్లోకి తీసుకెళ్లారు. నిజానికి తిరుపతి ప్రాంతంలో బీజేపీ – జనసేన బలంగా ఉంది. ఆధ్యాత్మిక ప్రాంతం తిరుపతి కావడంతో బీజేపీకి కలిసివచ్చే అవకాశం ఉంది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కొద్దోగొప్పో క్యాడర్, ఓటు బ్యాంకు ఉంది.

    మరోవైపు ఈ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థినే బరిలోకి దింపాలని పవన్‌ కల్యాణ్‌ భావిస్తున్నారని తెలిసింది. ఉప ఎన్నిక పార్లమెంటుకు సంబంధించింది కాబట్టి తమకు బలం ఉన్నా బీజేపీ అభ్యర్థికే వదిలేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. రెండు పార్టీలూ కలిసి పోటీ చేయాలని, బీజేపీ నుంచి బలమైన అభ్యర్థిని ఎంపిక చేయాలని కూడా పవన్ కల్యాణ్ ఆ పార్టీ నేతలకు సూచించినట్లు తెలిసింది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    ఈ క్రమంలోనే ఏపీలో జరిగే తొలి ఎన్నిక ఇప్పుడు సోము వీర్రాజుకు కత్తిమీద సాములా మారింది. పక్కన బండి సంజయ్ నిరూపించుకోవడంతో ఇప్పుడు సోముపైనే ఒత్తిడి నెలకొంది. బండిలా ప్రచారం, వ్యూహాలు, యువతను ఆకర్షించడం.. నియోజకవర్గంో మోహరింపు ఎలా చేస్తాడనే దానిపైనే సోము విజయం ఆధారపడింది. ఈ క్రమంలోనే తిరుపతిలో బీజేపీని గెలిపిస్తే బండికి తగ్గ సోముగా ఏపీ రాజకీయాల్లో నిలబడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే తిరుపతి ఉప ఎన్నిక ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడికి పరీక్ష అనడంలో ఎలాంటి సందేహం లేదు.

    -నరేశ్