Summer : ఎండాకాలం రాగానే వాతావరణం వేడెక్కుతుంది. దీంతో బయటకు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా వేడెక్కుతూ ఉంటాయి. సాధారణంగానే వీటిలో వేడి ఎక్కువగా ఉంటుంది.. వేసవికాలంలో ఇవి మరింత వేడెక్కి ప్రమాదాలకు గురవుతూ ఉంటాయి. అయితే ఎక్కువగా ఏసి ఉన్న గదిలో కొందరు ఏసీలు ఏర్పాటు చేసుకుంటారు. కానీ అందరి ఇళ్లల్లో ACలు ఉండే అవకాశం లేవు. అందువల్ల ప్రత్యామ్నాయంగా ఇతర ఏర్పాట్లు చేసుకోవాలని కొందరు సాంకేతిక నిపుణులు తెలుపుతున్నారు. వీటిని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వేడి నుంచి తట్టుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే ఏసీలు లేని వారు ఎలాంటి ఏర్పాటు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
కొందరు ఏసీలు లేకుండా కంప్యూటర్లు వాడేవారు ఇంట్లో వెంటిలేషన్ బాగుండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఒక కంప్యూటర్ను ఏర్పాటు చేసుకునేవారు కిటికీ దగ్గర పెట్టుకోవడం ఉత్తమం. సిస్టంను వాడేటప్పుడు సిపియూ రన్నింగ్ కావడం వల్ల వేడి అవుతుంది. ఇది కిటికీ దగ్గర ఉంటే బయటి గాలితో కూల్ అవుతుంది. అలాకాకుండా వెంటిలేషన్ లేకపోవడం వల్ల గది మొత్తం వేడితో నిండిపోతుంది. దీంతో అక్కడ ఉన్న వారిలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
Also Read : వేసవిలో మీ కారును జాగ్రత్తగా చూసుకునేందుకు ఈ చిట్కాలు పాటించండి
కొందరు తమకు తెలియకుండానే ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఒకదానిపై ఒకటి పెడుతూ ఉంటారు. ముఖ్యంగా సిస్టంపై ఫోన్ లేదా ఫోన్ పై ఫోన్ ఇలా పెడుతూ ఉంటారు. అయితే ఫోన్ రేడియేషన్ తో వేడి అవుతూ ఉంటుంది. వేసవి కాలంలో ఇవి మరింత వేడెక్కి నష్టాలు జరిగే అవకాశం ఉంది. అందువల్ల ఇలా ఫోన్ పై ఫోన్ కాకుండా లేదా ఎలక్ట్రానిక్స్ ఒకదానిపై ఒకటి కాకుండా దూర దూరంగా ఉంచుకోవాలి.
కొన్ని ఎలక్ట్రానిక్స్ వస్తువులపై సూర్య రష్మీ పడకుండా జాగ్రత్తపడాలి. సూర్య రశ్మి పడడం వల్ల వెంటనే వేడెక్కి ఇవి పాడవుతూ ఉంటాయి. ఒకవేళ ఇక్కడ సూర్యరశ్మి పడకుండా చేయలేని సమయంలో ఏదైనా క్లాత్ ను ఏర్పాటు చేసి ఎండ వేడి తగలకుండా చూసుకోవాలి. సూర్య రష్మి లో నుంచి వచ్చే వేడి అధికంగా ఉండడంతో గాడ్జెట్స్ వేడెక్కి ప్రమాదాలకు గురవుతూ ఉంటాయి.
ఫోన్ చార్జింగ్ పెట్టిన సమయంలో ఇంట్లో వెంటిలేషన్ ఉండే విధంగా చూడాలి. కొందరు ఫోన్ చార్జింగ్ పెట్టి మరి ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మరింత ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. సాధారణంగానే ఫోన్ కు రేడియేషన్ ద్వారా వేడి గ్రహిస్తుంది. దీనిని చార్జింగ్ పెట్టడం వల్ల మరింత వేడెక్కి ఇవి ఒక్కోసారి పేలిపోయే అవకాశం ఉంది. అందువల్ల ఎట్టి పరిస్థితిలో ఫోన్ చార్జింగ్ పెట్టి మాట్లాడే ప్రయత్నం చేయొద్దు.
ఫోన్ తో పాటు ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు వాడిన సమయంలో వేడిగా అనిపిస్తే కాసేపు దానిని ఆఫ్ చేసి ఉంచాలి. అలా కాకుండా అలాగే దానిని ఉపయోగించడం వల్ల వేసవికాలంలో అవి మరింత వేడెక్కి పాడైపోయే అవకాశం ఉంటుంది. కొన్ని నకిలీ ఫోన్లో పేలిపోయే అవకాశం కూడా ఉంది. అందువల్ల వేసవికాలంలో ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సాంకేతిక నిపుణులు తెలుపుతున్నారు.
Also Read : ఎండలోకి వెళ్లే ముందు ఈ చిట్కాలు పాటిస్తే.. వడదెబ్బకు గురికాకుండా ఉంటారు.. అవేంటంటే?