Ashwin Kumar Pick 4 Wickets
MI vs KKR : ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్(MI vs KKR) ఎదుట సాగిలపడింది. ఎటువంటి ప్రతిఘటన చూపించకుండానే చేతులెత్తేసింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ కోల్ కతా( Kolkata knight riders) జట్టు కేవలం 116 పరుగులకే కుప్ప కూలింది. రఘువంశి (26), రమణ్ సింగ్ సింగ్ (22) కాస్తలో కాస్త ముంబై ఇండియన్స్ బౌలర్లను ప్రతిఘటించారు. తద్వారా కోల్ కతా నైట్ రైడర్స్ ఆమాత్రమైనా పరుగులు చేయగలిగింది. లేకుంటే కోల్ కతా జట్టు పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉండేది. కోల్ కతా జట్టు పతనాన్ని అశ్వని కుమార్(Ashwani Kumar) అనే బౌలర్ శాసించాడు. ఇతడు ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ రహనే (11), రింకూ సింగ్ (17), మనీష్ పాండే (19), రస్సెల్ (5) వంటి వారిని పెవిలియన్ పంపించి..కోల్ కతా నైట్ రైడర్స్ ను కోలుకోకుండా చేశాడు..
Also Read : కోల్ కతా కు ఇదేం దరిద్రం.. ముంబై పై ఆరుసార్లు..
అద్భుతమైన గణాంకాలు
కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పై నాలుగు వికెట్లు పడగొట్టడం ద్వారా అశ్వని కుమార్ సరికొత్త గణాంకాలు నమోదు చేశాడు. ఐపీఎల్ లో తొలి మ్యాచ్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్ల జాబితాలో అల్జారి జోసెఫ్ ఉన్నాడు.. ఇతడు 2019లో ముంబై ఇండియన్స్ జట్టుతరఫున ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ మ్యాచ్లో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు.
ఇక రెండో స్థానంలో 2017లో గుజరాత్ లయన్స్ జట్టు తరఫున ఆడిన ఆండ్రు టై వున్నాడు.. rising Pune super giants జట్టుపై అతడు 5/17 గణాంకాలు నమోదు చేశాడు.
2008లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తరఫున బౌలింగ్ వేసిన షోయబ్ ఆక్టర్ ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుపై 4/11 గణాంకాలు నమోదు చేశాడు.
ఇక సోమవారం కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బౌలర్ అశ్వని కుమార్ (4/24) నాలుగు వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు.
ఇతడి తర్వాత రాజస్థాన్ రాయల్స్ బౌలర్ కెమాన్ కూపర్ 2012లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో (4/26) నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు డేవిడ్ వైస్ 2015లో ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో (4/33) అద్భుతమైన గణాంకాలతో అదరగొట్టాడు..
తన తొలి ఐపిఎల్ మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసిన భారతీయ బౌలర్ గా అశ్విని కుమార్ రికార్డ్ సృష్టించాడు. అయితే నాలుగు వికెట్లు పడగొట్టిన తర్వాత అశ్విని కుమార్ మాట్లాడాడు..” నాకు ఈ రోజు నాలుగు వికెట్లు తీయడం ఆనందంగా అనిపించింది. నేను ఐపీఎల్ లో స్థిరంగా ఉండడానికి దోహదం చేసింది. ఈరోజు నేను భోజనం చేయలేదు. కేవలం అరటిపండు మాత్రమే తిన్నాను. కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ.. పెద్దగా ఆకలి అనిపించలేదు. ఇది ముందుగానే రూపొందించుకున్న ప్రణాళిక కాబట్టి వికెట్లను తీయడంలో ఇబ్బంది అనిపించలేదు… తొలి మ్యాచ్ అయినప్పటికీ టీం మేనేజ్మెంట్ నాకు అండగా నిలిచింది. తొలి మ్యాచ్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడకూడదని సూచించింది. హార్దిక్ పాండ్యా నన్ను బౌలింగ్ లోకి తీసుకున్నాడు.. నాలుగు వికెట్లను పడగొట్టడం ద్వారా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది జట్టుకు ఎంతో లాభం చేకూర్చుతుందని భావిస్తున్నానని” అశ్వని కుమార్ పేర్కొన్నాడు.