https://oktelugu.com/

Summer Health Tips: ఎండలోకి వెళ్లే ముందు ఈ చిట్కాలు పాటిస్తే.. వడదెబ్బకు గురికాకుండా ఉంటారు.. అవేంటంటే?

శరీరంలోని నీరంతా బయటకు వెళ్లి డిహైడ్రేషన్ అవుతుంది. అయితే ఈ పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Written By: , Updated On : March 9, 2025 / 04:00 AM IST
Summer Health Tips (2)

Summer Health Tips (2)

Follow us on

Summer Health Tips: ప్రస్తుత వాతావరణం ఆందోళనకరంగా ఉంటుంది. ఉదయం ఎండ వేడిని ఇస్తుండగా.. సాయంత్రం చల్లగాలులతో ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. దీంతో ప్రజలు అయోమయంలో పడిపోతున్నారు. అయితే వేసవికాలం అయినందున ఎండ వేడి సర్వసాధారణమే. కానీ శివరాత్రి వెళ్ళిన తర్వాత కూడా చల్లగా ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా శివరాత్రి తో చలికాలం ముగుస్తుందని భావిస్తారు. కానీ కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరుగుతుంది. దీంతో కొందరు అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే ఉదయం ఎండ వేడికి తట్టుకోలేక కొందరు అలసటగా మారుతున్నారు. శరీరంలోని నీరంతా బయటకు వెళ్లి డిహైడ్రేషన్ అవుతుంది. అయితే ఈ పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

నేటి కాలంలో ఎక్కువ శాతం మంది కార్యాలయం లోపల ఉండే వర్క్ చేసేవాళ్లే ఉన్నారు. ఇలాంటివారు ఒక్కసారిగా ఎండవేడికి బయటకు వెళ్లడంతో శరీరం డిహైడ్రేషన్కు గురవుతోంది. క్రమంగా వడదెబ్బకు కూడా గురవుతున్నారు. కాసేపు ఎండలో ఉండడం వల్ల చర్మం వేడెక్కుతుంది. దీంతో చర్మం ఎర్రబడి దద్దుర్లు కూడా వస్తున్నాయి. అలాగే ఎండలో ఎక్కువసేపు ఉండడంవల్ల చెమటలు ఎక్కువగా వచ్చి శరీరంలోని నీరంతా బయటకు వస్తుంది. దీంతో డిహైడ్రేషన్ కు గురై శక్తిని కోల్పోతారు. ఆ తర్వాత బలహీనత ఏర్పడి మైకం వస్తుంది. కొందరికి ఎండలో ఎక్కువసేపు ఉండడం వల్ల తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత వికారం వస్తుంది. ఒక్కోసారి వాంతులు కూడా అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ సేపు ఎండలో ఉన్నవారికి గుండెపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.

అయితే ఎండలోకి వెళ్లాలని అనుకునేవారు ముందే జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్యల బారిన పడకుండా ఉంటారు. తప్పనిసరి అయితే తప్ప ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో ఎండలోకి వెళ్లకుండా ఉండడమే మంచిది. ఒకవేళ వెళ్లేముందు ఫేస్ పై సన్ స్క్రీన్ అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరంపై దద్దుర్లు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే నెత్తిపై క్యాప్ లేదా రుమాలు చుట్టుకోవడం వల్ల శరీరంపై ఎండ వేడి పడకుండా ఉంటుంది. ఇక సన్ గ్లాస్ పెట్టుకోవడం వల్ల కళ్లపై కూడా ప్రభావం ఉండదు.

డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉండాలంటే.. ఎండలోకి వెళ్లే ముందే కనీసం రెండు గ్లాసుల నీరు తాగి వెళ్ళండి. మొత్తంగా ఒక రోజులో 8 గ్లాసుల నీరు తాగాలి. ఎండలోకి వెళ్లే ముందు దోసకాయ, పుచ్చకాయ వంటివి తీసుకోవాలి. ఇవి శరీరంలోని నీటి శాతాన్ని నిల్వ చేస్తాయి. ఇక ఎండలో ప్రయాణించాలని అనుకునేవారు కాఫీ టీలకు దూరంగా ఉండాలి. అలాగే మద్యానికి కొన్ని రోజులు పుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే ఇవి డీహైడ్రేషన్ ను ఎక్కువగా చేస్తాయి.

ఎండలో ప్రయాణం చేయాలని అనుకునేవారు కాటన్ దుస్తులను మాత్రమే ధరించాలి. ప్రతిరోజు స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి. వేడి నీటితో కాకుండా చన్నీటితో స్నానం చేయడం వల్ల శరీరం లో ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇక ఎండలో నుంచి ఇంట్లోకి వచ్చిన తర్వాత కాసేపు ఫ్యాన్ వద్ద కూర్చొని ఉండాలి. ఆ తర్వాతే మిగతా పనులు మొదలు పెట్టాలి.