https://oktelugu.com/

సోము వీర్రాజును వాళ్లు టార్గెట్ చేస్తున్నారా?

సోము వీర్రాజు… ప్రస్తుతం ఏపీ బీజేపీ రాష్ట్ర చీఫ్‌. అంతకుముందు ఉన్న కన్నా లక్ష్మీనారాయణను తప్పించి అధిష్టానం పార్టీ పగ్గాలు సోము వీర్రాజుకు అప్పగించింది. ఆయన బాధ్యతలు చేపట్టి ఇంకా ఏడాది కూడా కాలేదు. కానీ.. అప్పుడే ఆయనపై వ్యతిరేక గళాలు వినిపిస్తున్నాయి. ఏ నాయకత్వాన్ని అయినా ఒకటి రెండు సంవత్సరాలు చూస్తే కానీ అర్థం చేసుకోలేము. కానీ.. కొందరు నేతలు మాత్రం సోముపై అప్పుడే అటాక్‌కు దిగుతున్నారు. Also Read: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 22, 2020 / 09:54 AM IST
    Follow us on


    సోము వీర్రాజు… ప్రస్తుతం ఏపీ బీజేపీ రాష్ట్ర చీఫ్‌. అంతకుముందు ఉన్న కన్నా లక్ష్మీనారాయణను తప్పించి అధిష్టానం పార్టీ పగ్గాలు సోము వీర్రాజుకు అప్పగించింది. ఆయన బాధ్యతలు చేపట్టి ఇంకా ఏడాది కూడా కాలేదు. కానీ.. అప్పుడే ఆయనపై వ్యతిరేక గళాలు వినిపిస్తున్నాయి. ఏ నాయకత్వాన్ని అయినా ఒకటి రెండు సంవత్సరాలు చూస్తే కానీ అర్థం చేసుకోలేము. కానీ.. కొందరు నేతలు మాత్రం సోముపై అప్పుడే అటాక్‌కు దిగుతున్నారు.

    Also Read: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ పని చేస్తే ఫ్రీగా భోజనం..?

    సోముకు అధ్యక్ష పదవి ఇచ్చే సందర్భంలోనూ కొంత మంది నేతలు అడ్డు పడ్డారట. సోము వీర్రాజుకు తప్ప ఎవరికి పదవి ఇచ్చినా పరవాలేదంటూ అధిష్టానం వద్ద తిష్టవేశారంట. అయితే.. పార్టీ అధిష్టానం మాత్రం వీర్రాజుకే పార్టీ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడం కొందరికి ఇంకా మింగుడు పడడం లేదు. ఏపీలో బీజేపీలో చూసుకుంటే మూడు వర్గాలు నడుస్తున్నట్లే కనిపిస్తోంది. ఒకటి టీడీపీ అనుకూల వర్గం. మరొకటి వైసీపీకి మద్దతు తెలిపే వర్గం. ఇంకోటి నికార్సయిన బీజేపీ వర్గం. ఈ మూడో వర్గానికి చెందిన వ్యక్తే సోము వీర్రాజు. ఆయనతో కలిపి నికార్సయిన బీజేపీ వర్గంలో కొద్ది మంది నేతలే. వారే ఇప్పుడు సోము వీర్రాజు చుట్టూ ఉన్నారు. మిగిలిన వారంతా ఏదో ఒక పార్టీతో అనుబంధం పెట్టుకున్నారు.

    సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీడీపీని ఎక్కువగా టార్గెట్‌ చేస్తున్నారు. వైసీపీపై విమర్శలు చేస్తున్నా అంతకన్నా ఎక్కువ స్థాయిలో టీడీపీపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. ఏపీలో బీజేపీ రెండో పొజిషన్ లోకి రావాలంటే టీడీపీ బలాన్ని తగ్గించాలి. అందుకే సోము వీర్రాజు టీడీపీని టార్గెట్‌గా చేశారు. కానీ.. ఇది కొందరు టీడీపీ అనుకూల నేతలకు ఇది రుచించడం లేదు.

    Also Read: ప్రజలకు హెచ్చరిక: తెలంగాణను కమ్మేసిన చలి.. కారణం అదే

    ముఖ్యంగా టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారిలో మాత్రం ఈ అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తోందట. ఇటీవల రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. నాయకులు వ్యక్తిగత ఎజెండాలను పక్కన పెట్టాలని సీఎం రమేష్ చేసిన కామెంట్స్ సోము వీర్రాజును ఉద్దేశించి చేసినవే. వైసీపీ నేతలపై కేసులు పెట్టేందుకు అవసరమైన మెటీరియల్ బీజేపీ వద్ద ఉందని, వారిపై కేసులు పెట్టాలని సీఎం రమేష్ కోరారు. దీనిని బట్టి చూస్తుంటే రానున్న కాలంలో సోము వీర్రాజుపై సొంత పార్టీ నేతల నుంచి మరింత ఎటాక్ ఎక్కువయ్యే అవకాశాలు బాగా కన్పిస్తున్నాయి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్