https://oktelugu.com/

కారు కొనాలనుకునే వాళ్లకు శుభవార్త.. ఏకంగా లక్ష రూపాయల డిస్కౌంట్..?

కార్ల కంపెనీలు కొత్త కారు కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త చెప్పాయి. కొత్త కారు కొనుగోలుపై కంపెనీలు భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఇయర్ ఎండ్ నేపథ్యంలో కంపెనీలు కార్ల కొనుగోలుపై ఆఫర్లను ప్రకటించాయి. 2021 జనవరి 1వ తేదీ నుంచి కార్ల ధరలు భారీగా పెరగనున్న నేపథ్యంలో కొత్తకారు కొనుగోలు చేయాలనుకునే వాళ్లు వీలైనంత త్వరగా కారును కొనుగోలు చేస్తే మంచిది. Also Read: 5000 ఇన్వెస్ట్ చేస్తే రోజుకు 500 ఇచ్చే యాప్.. కానీ..? కార్ల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 22, 2020 / 10:06 AM IST
    Follow us on


    కార్ల కంపెనీలు కొత్త కారు కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త చెప్పాయి. కొత్త కారు కొనుగోలుపై కంపెనీలు భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఇయర్ ఎండ్ నేపథ్యంలో కంపెనీలు కార్ల కొనుగోలుపై ఆఫర్లను ప్రకటించాయి. 2021 జనవరి 1వ తేదీ నుంచి కార్ల ధరలు భారీగా పెరగనున్న నేపథ్యంలో కొత్తకారు కొనుగోలు చేయాలనుకునే వాళ్లు వీలైనంత త్వరగా కారును కొనుగోలు చేస్తే మంచిది.

    Also Read: 5000 ఇన్వెస్ట్ చేస్తే రోజుకు 500 ఇచ్చే యాప్.. కానీ..?

    కార్ల కంపెనీలు ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీలోపు కార్లు కొనుగోలు చేసేవాళ్లకు ఈ ఆఫర్లను అందిస్తున్నాయి. ప్రముఖ కార్ల కంపెనీలలో ఒకటైన హ్యూందాయ్ ఎలెంట్రా, ఆరా, గ్రాండ్ ఐ10 నియోస్, గ్రాండ్ ఐ10, శాంట్రో కంపెనీల కార్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. డిసెంబర్ డిలైట్ ఆఫర్ పేరుతో హ్యూందాయ్ సంస్థ కస్టమర్ల కోసం ఈ ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎల్టీసీ వోచర్లను వినియోగించి కారును కొనుగోలు చేస్తే అదనంగా 8,000 రూపాయల డిస్కౌంట్ ను పొందవచ్చు.

    Also Read: వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. అతి త్వరలో ఆరోగ్య బీమా పాలసీ..?

    కారు మోడల్ ను బట్టి కస్టమర్లు పొందే డిస్కౌంట్ లలో మార్పులు ఉంటాయి. హ్యూందాయ్ కంపెనీ ఎలెంట్రా మోడల్ కారుపై ఏకంగా లక్ష రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది. హ్యూందాయ్ ఆరా కారు కొనుగోలుపై 70 వేల రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారుపై 60,000 రూపాయల వరకు తగ్గింపు అందుబాటులో ఉంటుంది. హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 కారుపై 60వేల రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తోంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    హ్యుందాయ్ కంపెనీ ఎక్కువగా అమ్ముడయ్యే శాంట్రో కారుపై 50 వేల రూపాయల వరకు క్యాష్ డిస్కౌంట్ ఇస్తోంది. ఈ కారును కొనుగోలు చేసిన వాళ్లకు మూడు సంవత్సరాల ఆన్ రోడ్ వారంటీ లభిస్తుంది. శాంట్రో కారు ధర 4.63 లక్షల రూపాయల నుంచి 6.31 లక్షల రూపాయల వరకు వేరియంట్ ను బట్టి ఉంటుంది.