https://oktelugu.com/

కలుషిత ఆహారం తిని ముగ్గుురి మృతి: మరో ఇద్దరి పరిస్థితి విషమం

కలుషిత ఆహారం తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని వట్ పల్లి మండలం పల్వట్ల గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు సోమవారం రాత్రి జొన్న రొట్టెలు తిన్నారు. మంగళవారం ఉదయం ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షత గాత్రులను హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. కాగా ఇదే కుటుంబానికి చెందిన ఓ మహిళ 15 రోజుల […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 22, 2020 / 09:47 AM IST
    Follow us on

    కలుషిత ఆహారం తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని వట్ పల్లి మండలం పల్వట్ల గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు సోమవారం రాత్రి జొన్న రొట్టెలు తిన్నారు. మంగళవారం ఉదయం ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షత గాత్రులను హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. కాగా ఇదే కుటుంబానికి చెందిన ఓ మహిళ 15 రోజుల కిందట మరణించింది. అయితే జొన్న రొట్టెల్లో విష పదార్థం కలిసినట్లు అనుమానిస్తున్నారు.