Indian Cricket Team: ఇండియన్ క్రికెట్ టీమ్ లో చాలామంది ప్లేయర్లు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్నారు. బ్యాటింగ్ లోను, బౌలింగ్ లోనూ వాళ్ల సత్తాను చాటుకోవడమే కాకుండా ఇండియన్ టీమ్ ను చాలాసార్లు గెలిపిస్తు యావత్ ఇండియన్ జనాలందరిని నిలబెడుతూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి మన క్రికెటర్లు ఎంతవరకు చదువుకున్నారు. అందులో ఎవరెవరు ఉన్నతమైన చదువులు చదివారు అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
అనిల్ కుంబ్లే
ఒకప్పుడు స్పిన్ దిగ్గిజంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న అనిల్ కుంబ్లే మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు.ఆయన స్పిన్ బౌలింగ్ ఎంత ఫేమసో మనందరికి తెలిసిందే. ఇక ఇంటర్నేషనల్ వైడ్ గా చాలా వండర్స్ ని క్రియేట్ చేసిన ఈయన లెగ్ స్పిన్ లో తనను మించిన వారు లేరనేంతల గుర్తింపు ను సంపాదించుకున్నాడు…
వెంకటేష్ అయ్యార్
ఐపీఎల్ లో కలకత్తా నైట్ రైడర్స్ టీం తరఫున ఆల్ రౌండర్ గా ఆడి మంచి గుర్తింపును సంపాదించుకున్న వెంకటేష్ అయ్యర్ సైతం ఇండియన్ క్రికెట్ టీమ్ లో అరంగేట్రం చేశాడు. ఇక ఇప్పటివరకు ఆయన ఆడిన మ్యాచ్ లు చాలా తక్కువే అయినప్పటికీ విన్నర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి వెంకటేష్ అయ్యర్ సైతం ఎంబీఏ ని పూర్తి చేశాడు. ప్రస్తుతం ఫైనాన్స్ లో పి హెచ్ డి చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఇటు క్రికెట్ ని అటు చదువును రెండిటిని సమపాలల్లో బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు…
ఇక టి20 ఫార్మాట్ కి స్పెషలిస్ట్ గా మారిన సూర్య కుమార్ యాదవ్ సైతం బీకాం డిగ్రీని పూర్తి చేసి బ్యాచిలర్ డిగ్రీ పట్టాను పొందాడు…
ఒకప్పుడు ఓపెనర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న మురళి విజయ్ సైతం ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు…
ఇక స్పిన్నర్ గా మంచి గుర్తింపు ను సంపాదించుకున్న రవిచంద్రన్ అశ్విన్ సైతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు…
ఇండియన్ క్రికెట్ టీమ్ కి చాలా సంవత్సరాల పాటు తన సేవలను అందించిన క్రికెటర్ రాహుల్ ద్రావిడ్… ఆయన ది వాల్ గా పేరు సంపాదించుకోవడమే కాకుండా కామర్స్ గ్రాడ్యుయేట్ గా పట్టా పొందాడు…
ఒకప్పుడు ఫాస్ట్ బౌలర్ గా తన కంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న జవగల్ శ్రీనాథ్ సైతం ఇన్స్ట్రుమెంటల్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ డిగ్రీ ని పొందాడు…
ఇండియన్ క్రికెట్ టీం కి దాదాపు పది సంవత్సరాలపాటు కెప్టెన్ గా వ్యవహరించడమే కాకుండా దాదా గా మంచి పేరు పొందిన క్రికెటర్ సౌరవ్ గంగూలీ…2003 వ సంవత్సరంలో జరిగిన వరల్డ్ కప్ లో ఇండియన్ టీం ని ఫైనల్ కి తీసుకెళ్లిన కెప్టెన్ కూడా తనే కావడం విశేషం…ఇక ఈయన కెప్టెన్ గా విజయాలను అందించడమే కాకుండా చదువుతో కూడా అందరిని ఆకట్టుకున్నాడు…ఇక ఈయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్,కలకత్తా నుంచి మేనేజ్ మెంట్ లో పట్టా పొందాడు…