Homeఎంటర్టైన్మెంట్Pushpa 2: ఆ రాష్ట్రంలో పుష్పరాజ్ దెబ్బకు ట్రాఫిక్ జామ్, ఇదేం క్రేజ్ రా మామ!...

Pushpa 2: ఆ రాష్ట్రంలో పుష్పరాజ్ దెబ్బకు ట్రాఫిక్ జామ్, ఇదేం క్రేజ్ రా మామ! వైరల్ వీడియో

Pushpa 2: సౌత్ లో పుష్ప 2 వసూళ్లు నెమ్మదించగా. నార్త్ లో మాత్రం స్టడీ రన్ కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాలకు మించిన రెస్పాన్స్ హిందీ రాష్ట్రాల్లో పుష్ప 2 కి దక్కుతుంది. రెండో వీకెండ్ సైతం అక్కడ పుష్ప 2 వసూళ్ళు కుమ్మేస్తుంది. ఆదివారం హిందీ వెర్షన్ రూ. 54 కోట్ల వసూళ్లతో సత్తా చాటింది. ఇక వర్కింగ్ డే సోమవారం కూడా పుష్ప 2 చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది. నిన్నటి వరకు పుష్ప 2 హిందీ వెర్షన్ రూ. 582 కోట్ల వసూళ్లు రాబట్టింది.

బాహుబలి 2 హిందీ వసూళ్లను కూడా పుష్ప 2 అధిగమించడం విశేషం. వరల్డ్ వైడ్ పుష్ప 2 రూ. 1400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కాగా రాయ్ పూర్ లో పుష్ప 2 థియేటర్ ఎదుట భారీ ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. పుష్ప 2 సినిమా చూసేందుకు మహిళలు, కుర్రాళ్లు పెద్ద ఎత్తున థియేటర్ కి వచ్చారు. టికెట్స్ కోసం కౌంటర్ వద్ద యుద్ధ వాతావరణం కనిపించింది. పుష్ప 2 చూసేందుకు వచ్చిన ఆడియన్స్ తో ఆ ప్రాంతం కిక్కిరిపోయింది. ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది.

మూవీ విడుదలై దాదాపు రెండు వారాలు దగ్గర పడుతున్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. పుష్ప 2తో అల్లు అర్జున్ దేశంలోనే అతిపెద్ద హీరోగా ఎదిగారు. ప్రభాస్, ఎన్టీఆర్-రామ్ చరణ్ ల తర్వాత వెయ్యి కోట్ల క్లబ్ లో అల్లు అర్జున్ చేరాడు. పుష్ప 2 రన్ మరో రెండు వారాలు కొనసాగేలా ఉంది. ఈ క్రమంలో రెండు వేల కోట్లకు ఈ మూవీ వసూళ్లు చేరువైనా ఆశ్చర్యం లేదు.

మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప 2 చిత్రాన్ని నిర్మించారు. అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటించింది. 2021లో విడుదలైన పుష్ప చిత్రానికి ఇది సీక్వెల్. ఫహద్ ఫాజిల్, జగపతిబాబు, రావు రమేష్, అనసూయ, సునీల్ కీలక రోల్స్ చేశారు. దేవిశ్రీ మ్యూజిక్ అందించారు. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ విడుదల చేశారు.

RELATED ARTICLES

Most Popular