YS Sharmila And Jagan: జగన్ జైల్లో ఉన్నప్పుడు భారతి కంటే ఎక్కువ షర్మిల బాధ పడింది. అన్న రాజకీయ మనుగడ కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కలియతిరిగింది. ఓదార్పు యాత్ర పేరుతో వైఎస్ఆర్సిపిని ప్రజల్లో బలంగా ఉంచింది. అన్న జైలు నుంచి విడుదలైన తర్వాత ఆ పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేసింది. 2019 ఎన్నికల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తన అన్నను ముఖ్యమంత్రిని చేయడంలో తన వయసుకు మించి కష్టపడింది. తీరా సీన్ కట్ చేస్తే అన్నతో విభేదాల వల్ల బయటకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో సొంతంగా పార్టీ పెట్టుకుంది. ఇక్కడ కూడా పాదయాత్ర చేసింది. ఎన్నికల్లో పోటీ చేస్తుంది అని నాటికి ఒక్కసారిగా తన నిర్ణయం మార్చుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు తన పార్టీని కాంగ్రెస్లో అధికారికంగా విలీనం చేస్తోంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సారధ్య బాధ్యతలు స్వీకరించబోతోంది..
ఇదంతా నిజమే. కళ్ళ కదలాడుతున్న వాస్తవమే. అయితే జగన్మోహన్ రెడ్డికి, షర్మిలకు మధ్య విభేదాలు లేవా? అవన్నీ కూడా మీడియా సృష్టేనా? విభేదాలు పెట్టుకోవాల్సినంత మనస్పర్ధలు షర్మిలకు, జగన్మోహన్ రెడ్డికి మధ్య లేవా? అంటే దీనికి ఎస్ అని చెబుతున్నారు ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ప్రియదర్శిని రామ్. చెల్లె అంటే జగన్మోహన్ రెడ్డికి చాలా ఇష్టమని.. ఆమె కాలేజీకి వెళ్తున్నప్పుడు రక్షణగా వెళ్లేవాడని.. ఆమె వైపు ఎవరు చూసినా కూడా ఊరుకునే వాడు కాదని ప్రియదర్శిని రామ్ అన్నారు.. షర్మిల కూడా అన్న పట్ల అదే విధమైన ప్రేమను చూపేదని ఆయన పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు అన్నకు సంఘీభావంగా దాదాపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 1350 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారని రామ్ పేర్కొన్నారు. చిన్నప్పుడు ఒక మామూలు తుపాకీతో కాల్చడం ఎలాగో జగన్మోహన్ రెడ్డి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు.. తన తల మీద ఆపిల్ పండు పెట్టి కాల్చమని చెప్పి షర్మిల ధైర్యంగా నిలబడిందని.. అలాంటి ప్రేమ ఉన్న ఇద్దరు అన్నా, చెల్లె మధ్య విభేదాలు ఎలా ఉంటాయని రామ్ ప్రశ్నించారు.. కాగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని వినియోగం చేస్తున్న క్రమంలో ప్రియదర్శిని రామ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే ప్రియదర్శిని రామ్ వ్యాఖ్యల పట్ల టిడిపి నాయకులు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీ సారధ్య బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో అది జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా నష్టమని, అందువల్లే ప్రియదర్శిని రామ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి, షర్మిలకు మధ్య విభేదాలు లేకపోతే వైసిపి నాయకులు ఆమెను లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఎందుకు చేస్తారని, అలాంటి విమర్శలు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఊరుకుంటారని వారు గుర్తు చేస్తున్నారు. ప్రియదర్శిని రామ్ ఒకప్పుడు సాక్షి దినపత్రికలో పనిచేశారు కాబట్టి.. కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కాబట్టి.. జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుత ఎన్నికల్లో ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని వారు పేర్కొంటున్నారు. కాగా ప్రియదర్శిని రామ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన టిడిపి నాయకులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.