
అన్ని రాష్ట్రాలు.. పక్కన తెలంగాణ ప్రభుత్వం కూడా విద్యార్థులకు పరీక్షలు రద్దు చేసింది. కానీ పరీక్షల నిర్వహణలో ఏపీ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు జగన్ సర్కార్ తీరుపై సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఏపీలో పరీక్షలు రద్దు చేస్తారా? లేక నిర్వహిస్తారా? అనే విషయంపై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఏపీ సర్కార్ ను ఆదేశించింది.పరీక్షలు జరిపితే పూర్తి వివరాలను అఫిడవిట్ లో తెలుపాలని.. పరీక్షల నిర్వహణతో ఒక్క మరణం సంభవించినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
పరీక్షల నిర్వహణతో ఒక్క మరణం సంభవించినా ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. విద్యార్థుల ప్రాణాలు ఫణంగా పెట్టి పరీక్షలు నిర్వహిస్తున్నారని మండిపడింది. వాటిపై విచారణలో పరీక్షలను రద్దు చేయని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
దేశంలో ఇప్పటివరకు 21 రాష్ట్రాలు రద్దు చేశాయి. కేరళ మాత్రం 11వ తరగతి పరీక్షలను రద్దు చేయలేదు. సెప్టెంబర్ వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. ఏపీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి విషయాన్ని చెప్పలేదు. దీంతో సుప్రీంకోర్టు గురువారం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
అన్ని రాష్ట్రాలు పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకున్నాక ఇంకా ఏపీకి ఎందుకు అనిశ్చితిని ధర్మాసనం ప్రశ్నించింది. నిజానికి ఈ అనిశ్చితి ప్రభుత్వంలోనే ఉందన్న విమర్శ ఉంది. ప్రభుత్వం తీరుతో ఇప్పటికే విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కరోనాతో ఎందుకీ పరీక్షలు రద్దు చేయాలని కోరుతున్నారు. గురువారం లోపు ఏపీ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది సుప్రీంకోర్టు.