
ఆగిరిపల్లి మండలం ఈదరలో విషాదం చోటుచేసుకుంది. అదృశ్యమైన చిన్నారులు శోభనాపురం అల్లూరమ్మ చెరువులో పడి మృతి చెందారు. నిన్న ఇంటి ముందు ఆడుకుంటూ ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. మృతులు శశాంక్ (11) చంద్రిక(9) జగదీశ్ (8) గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు.