
సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత విజయశాంతి మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన పర్యటనలు కాలక్షేపానికే తప్పితే వాటి వల్ల ప్రజలకు ఒరిగేదేమీ ఉండడం లేదని దుయ్యబట్టారు. సీఎం పర్యటనలు అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని విమర్శించారు. ఈ పిచ్చి పర్యటనలు, మాసపు వాగ్దానాల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు.