https://oktelugu.com/

TRS vs BJP: టీఆర్ఎస్, బీజేపీ మధ్య విభేదాలు పెరుగుతున్నాయా?

TRS vs BJP: తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తలు మారుతున్నాయి. పార్టీల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. ఒక పార్టీకి మరో పార్టీపై ఆగ్రహం ఎందుకు రెట్టింపవుతోంది. కొద్ది రోజులుగా అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య దూరం ఎక్కువవుతోంది. ఢిల్లీ వేదికగా కూడా ఇదే విషయంపై పలుమార్లు గొడవలు చెలరేగాయి. ప్రస్తుతం మాత్రం రెండు పార్టీల మధ్య ఇంకా అగాధం పెరుగుతోంది. ఒక పార్టీ నేతలు పర్యటన చేస్తే మరో పార్టీ నేతలు అడ్డుకోవడం సాధారణంగా మారిపోతోంది. భవిష్యత్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 26, 2022 / 02:55 PM IST
    Follow us on

    TRS vs BJP: తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తలు మారుతున్నాయి. పార్టీల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. ఒక పార్టీకి మరో పార్టీపై ఆగ్రహం ఎందుకు రెట్టింపవుతోంది. కొద్ది రోజులుగా అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య దూరం ఎక్కువవుతోంది. ఢిల్లీ వేదికగా కూడా ఇదే విషయంపై పలుమార్లు గొడవలు చెలరేగాయి. ప్రస్తుతం మాత్రం రెండు పార్టీల మధ్య ఇంకా అగాధం పెరుగుతోంది. ఒక పార్టీ నేతలు పర్యటన చేస్తే మరో పార్టీ నేతలు అడ్డుకోవడం సాధారణంగా మారిపోతోంది. భవిష్యత్ లో ఇలాగే కొనసాగితే ఇంకా విభేదాలు ముదిరే అవకాశాలే ఎక్కువగా కనిపిపిస్తున్నాయి.

    TRS vs BJP

    హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత రెండు పార్టీల్లో వైరం మరింత పెరిగిపోయింది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని చెబుతున్న క్రమంలో దాన్ని అడ్డుకోవాలని గులాబీ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగానే నిజామాబాద్ పర్యటనకు వెళ్లిన ఎంపీ ధర్మపురి అర్వింద్ ను కొందరు పసుపు రైతులు అడ్డుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ వారు టీఆర్ఎస్ నేతలే అని చెబుతున్నారు. దీంతో రాజకీయ దుమారం రేగుతోంది. రెండు పార్టీల్లో రాజకీయ విభేదాలు మరింత ముదురుతున్నాయని తెలుస్తోంది.

    తెలంగాణలో మంత్రి కేటీఆర్ ను చాలాసార్లు బీజేపీ నేతలు అడ్డుకోవడం తెలిసిందే. దీన్ని టీఆర్ఎస్ నేతలు కూడా అలవాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతోనే వారు అర్వింద్ ను లక్ష్యంగా చేసుకుని అడ్డగించినట్లు చెబుతున్నారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు తెస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినా ఆచరణలో నిరూపించలేదు. దీంతో ఆయనను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు.

    ఇదే సంప్రదాయం కొనసాగితే రాబోయే రోజుల్లో రెండు పార్టీల మధ్య మరింత దూరం పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి. రాష్టంలో పార్టీల్లో అసహనం పెరిగిపోతోంది. అధికార పక్షం ప్రతిపక్షం అనే తేడాలు లేకుండానే విమర్శలు చేసుకుంటున్నాయి. ఆపై దాడులకు తెగబడటం కూడా చూస్తున్నాం. దీంతో పార్టీల మధ్య ఇంత తీవ్ర స్థాయిలో విభేదాలు పెరగడానికి కారణం అధికారమే.

    Also Read: TRS vs BJP: కేసీఆర్ కు షాక్.. బీజేపీ ప్రతిఘటన.. రక్తికడుతున్న తెలంగాణ రాజకీయం

    మరోవైపు గతంలో ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న క్యూ టీవీ అధినేత, తీన్మార్ మల్లన్నను కూడా అదుపులోకి తీసుకుని కొద్ది రోజులు జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇలా టీఆర్ఎస్ ఏకపక్ష నిర్ణయాలతో ప్రతిధ్వనించే గొంతులను నొక్కేందుకే ప్రాధాన్యం ఇస్తోంది. దీంతోనే నేతలను టార్గెట్ చేసుకుని వారిని ఎదగనీయకుండా చేయడంలో భాగంగానే ప్రభుత్వం అరెస్టులకు పూనుకోవడం తెలిసిందే.

    భవిష్యత్ లో మరిన్ని రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ర్టంలో ఆధిపత్య పోరు పెరుగుతోంది. దీంతోనే పార్టీల్లో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి. దీంతో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పొసగడం లేదు. కొద్ది రోజులుగా ఢిల్లీ కేంద్రంగా కూడా టీఆర్ఎస్ బీజేపీని అభాసుపాలు చేయాలని చూస్తోంది. దీని కోసమే పావులు కదుపుతోంది. ఈనేపథ్యంలోనే రెండు పార్టీల్లో గొడవలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

    Also Read: గజ్వేల్ లో పోటీచేయవద్దని కేసీఆర్ డిసైడ్ అయ్యాడా? అందుకే భయపడుతున్నాడా?

    Tags