Vijayawada TDP: తెలుగుదేశం పార్టీ విజయవాడపై ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీని విజయతీరాలకు చేర్చే క్రమంలో అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగాలని భావిస్తోంది. దీంతో టీడీపీలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు. పార్టీని గట్టెక్కించే వారి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. చంద్రబాబులో కూడా ఈ మధ్య మార్పు కనిపిస్తోంది. కార్యకర్తలను అక్కున చేర్చుకోవాలని చూస్తున్నారు.
విజయవాడ టీడీపీలో గ్రూపు విభేదాలు కనిపిస్తూనే ఉన్నాయి. పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని, ఇతరులకు మధ్య పొసగడం లేదు. దీంతో వర్గపోరు బాహాటంగానే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కేశినేని నాని, బుద్దా వెంకన్న మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనేంత దూరం పెరిగింది. దీంతో రాబోయే ఎన్నికల్లో పార్టీకి విజయం అంత సులభం కాదేమోననే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.
ఇటీవల కాలంలో చంద్రబాబు కూడా కేశినేని నానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పార్టీనేతల్లో కూడా నైరాశ్యం నెలకొంటోంది. చంద్రబాబు ఏకపక్ష నిర్ణయాలతో పార్టీ ఉనికి ప్రమాదంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా బాబు దిద్దుబాటు చర్యలు చేపట్టి కార్యకర్తల మనోభావాలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
చంద్రబాబు మెప్పు కోసమే టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారే తమ పలుకుబడి ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ఇదే అదనుగా భావించి టీడీపీ నేతలు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ ప్రభావం చూపించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తల వ్యూహాలు మారుతున్నట్లు చెబుతున్నారు.
Also Read: కొత్త జిల్లాలను ఏ ప్రాతిపదికన విభజించారు? ఎవరికి లాభం.? ఎవరికి నష్టం