NTR District: ఎన్టీఆర్ జిల్లా.. ‘జగన్’ మగాడ్రా బుజ్జీ!

NTR District: ఏపీ రాజకీయాలను మరోసారి వేడెక్కించేందుకు రంగం సిద్ధం చేశారు ముఖ్యమంత్రి జగన్.. గతంలో అధికారంలో లేని టైంలోనే కడప జిల్లాకు తన తండ్రి వైఎస్సార్ పేరును పెట్టారు జగన్. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. జగన్ ఏది చేయాలన్న ఎవరి అనుమతి అక్కర్లేదు. దీంతో తెలుగుదేశం పార్టీకి, అధినేత చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు భారీ స్కెచ్ వేశారు. కొత్త జిల్లాల పునర్విభజనలో భాగంలో కృష్ణా జిల్లాకు స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు […]

Written By: Mallesh, Updated On : January 26, 2022 3:07 pm
Follow us on

NTR District: ఏపీ రాజకీయాలను మరోసారి వేడెక్కించేందుకు రంగం సిద్ధం చేశారు ముఖ్యమంత్రి జగన్.. గతంలో అధికారంలో లేని టైంలోనే కడప జిల్లాకు తన తండ్రి వైఎస్సార్ పేరును పెట్టారు జగన్. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. జగన్ ఏది చేయాలన్న ఎవరి అనుమతి అక్కర్లేదు. దీంతో తెలుగుదేశం పార్టీకి, అధినేత చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు భారీ స్కెచ్ వేశారు. కొత్త జిల్లాల పునర్విభజనలో భాగంలో కృష్ణా జిల్లాకు స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు పెట్టాలని వైఎస్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. జగన్ నిర్ణయంతో అటు తెలుగు తమ్ముళ్లు కూడా విమర్శలు చేయలేని పరిస్థితులను జగన్ క్రియేట్ చేశారు. సీఎం నిర్ణయాన్ని టీడీపీ నేతలు ఎవరైనా తప్పుబడితే ప్రజల్లో వారు విలన్ అయిపోతారు. ఎటూ చూసినా జగన్ నిర్ణయం తెలుగుదేశం నాయకులను, బాబుకు భారీగా డ్యామేజ్ కలిగించనున్నట్టు తెలుస్తోంది.

NTR District

అప్పట్లో కడపజిల్లాలకు వైఎస్సార్ పేరు పెట్టిన సమయంలో టీడీపీ ప్రభుత్వం, దాని అనుకూల మీడియా కడప జిల్లా పేరు మీదనే జీవోలు, కథనాలను ప్రచురించేది. వైఎస్సార్ జిల్లాగా అసలు గుర్తించలేదు. కానీ పక్కనే ఉన్న నెల్లూరు జిల్లాను మాత్రం పొట్టి శ్రీరాములు జిల్లాగా పరిగణించేవారు. తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయం అమల్లోకి వస్తే చంద్రబాబు మొహం ఎక్కడ పెట్టుకుంటారని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎందుకంటే బాబు రాజకీయంగా ఇంత ఎత్తుకు ఎదిగారంటే.. పలుమార్లు ముఖ్యమంత్రి అయ్యారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ.. దీనికి దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్థాపించారు. పార్టీ పెట్టిన అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చి రికార్డు క్రియేట్ చేశారు. పేదలకు సంక్షేమ పథకాల పేరుతో మంచి పాలన అందించారు.

Also Read: విజయవాడ టీడీపీలో ఏం జరుగుతోంది?

ఆ తర్వాత చంద్రబాబు టీడీపీలోకి వచ్చి ఏకంగా ఎన్టీఆర్ నుంచి టీడీపీని తన హస్తగతం చేసుకున్నారు. ఎన్టీఆర్ వారసులను కూడా ఆ పార్టీకి దూరంగా ఉంచారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో నందమూరి వారసత్వం లేకుండా పోయింది. ఉన్నదల్లా నారా వారి వారసత్వమే.. చంద్రబాబు తెలుగు దేశం పార్టీ తరఫున మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ టైంలో ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని కేంద్రలోని అలయన్స్ ప్రభుత్వాన్ని ఒక్కసారి కూడా కోరలేదు. ఏకంగా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు కనీసం ఒక్క జిల్లాకు కూడా ఎన్టీఆర్ పేరు పెట్టలేదు.

ఒకవేళ చంద్రబాబు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడికి భారత రత్న లేదా ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టినా.. మామను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారనే అపవాదు కొంచెమైనా చెరిగిపోయేది. ఇప్పటికీ వైసీపీ సీనియర్ లీడర్లు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పోవడం వల్లే బాబు ఇప్పుడు అనుభవిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఎన్టీఆర్ మీద అభిమానంతో ముఖ్యమంత్రి జగన్ ఏకంగా కృష్ణ జిల్లాకు ఆయన పేరును పెట్టాలని ప్రతిపాదించడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ తమను ప్రజాక్షేత్రంలో తలెత్తుకోనివ్వకుండా చేశారని, బాబు గతంలోనే ఈ నిర్ణయం తీసుకుంటే బాగుండేదని కొందరు తెలుగు తమ్ముళ్లు పెదవి విరుస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

Also Read: కొత్త జిల్లాలను ఏ ప్రాతిపదికన విభజించారు? ఎవరికి లాభం.? ఎవరికి నష్టం

Tags