కేసీఆర్ కు భయపడే ఢిల్లీ నేతలు వస్తున్నారా.?

భారతీయ జనతా పార్టీ తమదే మేయర్‌ పీఠం.. అని తెగేసి చెబుతోంది. ఈ క్రమంలో జాతీయ నాయకుల్ని ప్రచారం కోసం తీసుకొచ్చి, గ్రేటర్‌ రాజకీయాల్లో హీట్‌ పెంచేస్తోంది. ‘ఇండియా – పాకిస్తాన్‌’ వ్యవహారాలు కూడా చర్చకు వచ్చేశాయి. సర్జికల్‌ స్ట్రైక్స్‌ అంటున్నారు, రోహింగ్యాలంటున్నారు, టెర్రరిస్టులంటున్నారు, మహనీయుల ఘాట్లను కూల్చేస్తామంటున్నారు. Also Read: రేపటితో తేలనున్న రజనీ రాజకీయ భవితవ్యం..? సీఎం కేసీఆర్.. బీజేపీ అగ్రనేతలందరూ హైదరాబాద్‌కు క్యూ కట్టడాన్ని తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. తన జాతీయ […]

Written By: NARESH, Updated On : November 29, 2020 2:29 pm
Follow us on

భారతీయ జనతా పార్టీ తమదే మేయర్‌ పీఠం.. అని తెగేసి చెబుతోంది. ఈ క్రమంలో జాతీయ నాయకుల్ని ప్రచారం కోసం తీసుకొచ్చి, గ్రేటర్‌ రాజకీయాల్లో హీట్‌ పెంచేస్తోంది. ‘ఇండియా – పాకిస్తాన్‌’ వ్యవహారాలు కూడా చర్చకు వచ్చేశాయి. సర్జికల్‌ స్ట్రైక్స్‌ అంటున్నారు, రోహింగ్యాలంటున్నారు, టెర్రరిస్టులంటున్నారు, మహనీయుల ఘాట్లను కూల్చేస్తామంటున్నారు.

Also Read: రేపటితో తేలనున్న రజనీ రాజకీయ భవితవ్యం..?

సీఎం కేసీఆర్.. బీజేపీ అగ్రనేతలందరూ హైదరాబాద్‌కు క్యూ కట్టడాన్ని తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. తన జాతీయ రాజకీయ దృక్పథం..వారి వెన్నులో వణుకు పుట్టిస్తోందని.. తానుఢిల్లీ వస్తే వారి కుర్చీ కిందకు నీళ్లు వస్తాయన్న కారణంగానే.. తనను ఆపడానికే వారందరూ.. హైదరాబాద్ తరలి వస్తున్నారన‌్నట్లుగా చెప్పడం ప్రారంభించారు. ఇది వినే వారికి కాస్త అతిశయోక్తిగానే అనిపిస్తోంది.

బీజేపీ నేతలు ఎద్దేవా చేయడానికి అస్త్రగా మారుతోంది. ఎందుకంటే.. కేసీఆర్ ఇంత వరకూ జాతీయ రాజకీయాల జోలికే వెళ్లలేదు. గత ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ జట్టు కడితే.. కేసీఆర్ ఆ జట్టు జోలికి కూడా వెళ్లలేదు. ఇప్పుడు.. బీజేపీకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తానని చెబుతున్నారు.

బీజేపీ జాతీయ స్థాయి నాయకులు గ్రేటర్‌ ఎన్నికల ప్రచారానికి రాకూడదా.? అంటే, రాకూడదన్న రూల్‌ అయితే లేదు. గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికలంటే, అవేమీ అసెంబ్లీ ఎన్నికలు కావు.. లోక్‌సభ ఎన్నికలు కావు. కార్పొరేషన్‌ ఎన్నికలు. గెలిచేది కార్పొరేటర్లు.. వారంతా కలిసి మేయర్‌ని ఎన్నుకుంటారు. గల్లీల్లో సమస్యలే ఈ ఎన్నికల్లో కీలకమైన ఎజెండా కావాల్సి వుంది. కానీ, ఇక్కడ వ్యవహారం ఇంకోలా వుంది. అంతర్జాతీయ సమస్యలు, గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో చర్చనీయాంశాలుగా మారుతున్నాయి.

Also Read: ఎక్కడా దొరక్కుండా మాట్లాడిన కేసీఆర్!

కేసీఆర్ జాతీయ పార్టీ గురించి తరచూ చర్చలు జరుగుతూ ఉంటాయి. నయా భారత్ పేరుతో కొత్త పార్టీని కన్ఫర్మ్ చేశారని..ఈ పార్టీని రిజిస్టర్ చేసేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారన్న ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్ మాత్రం అదేం లేదన్నారు. కానీ తరచూ.. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని.. కొత్త పార్టీ అవసరం ఉందని చెబుతూ ఉంటారు. తానే ఆ కొత్త పార్టీ పెడతానన్నట్లుగా చెబుతూ ఉంటారు. అలాంటి ప్రకటనలను. గ్రేటర్ లాంటి ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి ఉపయోగించుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్