కరోనాలోనూ ‘బిగ్ బాస్’ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. తెలుగు రియల్టీ షోలలో నెంబర్ వన్ గా కొనసాగుతున్న బిగ్ బాస్ తన స్థానాన్ని బిగ్ బాస్-4తో మరింత పదిలం చేసుకుంది. నాలుగో సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో గేమ్ రసవత్తరంగా మారుతోంది. దీంతో బుల్లితెర ప్రేక్షకులు బిగ్ బాస్ ను చూసేందుకు మరింత ఆసక్తిని చూపుతున్నారు.
Also Read: ‘ఆదిపురుష్’లో కాస్ట్ కటింగ్.. మూవీపై ఎఫెక్ట్ పడుతుందా?
బిగ్ బాస్-4లో ప్రస్తుతం దెత్తడి హరిక.. మొనాల్ గజ్జర్.. అరియానా.. అభిజిత్.. అఖిల్.. అరియానా.. అవినాష్ మాత్రమే మిగిలి ఉన్నారు. వీరి మధ్యే పోటీ తీవ్రంగా ఉంది. ఈ ఏడుగురిలో బిగ్ బాస్ విన్నర్ ఎవరా? అనేది ఆసక్తి మొదలైంది. ఈ వారం నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్స్ కు బిగ్ బాస్ షాకులు మీద షాకిలిస్తున్నాడు.
ఈ వారం నామినేషన్ నుంచి తొలుత తప్పించుకున్న మొనాల్ కెప్టెన్ హారిక కారణంగా అనుహ్యంగా నామినేషన్లోకి వెళ్లాల్సి వచ్చింది. అయితే ఎలిమినేషన్లలో ఉన్న మొనాల్ కు అనుహ్యంగా దాదాపు 40శాతం ఓటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే టైటిల్ విన్నర్ రేసులో ఉన్న అభిజిత్ కు నిన్నటి ఎపిసోడ్లో బిగ్ బాస్.. హోస్ట్ నాగార్జున ఓ ఆట ఆడేసుకోవడం ఆసక్తికరంగా మారింది.
బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా అభిజిత్ పేరు తొలి నుంచి పాపులర్ అవుతూ వస్తోంది. అయితే అతడు బిగ్ బాస్ నిర్వహించే ఏ టాస్కులోనూ పెద్దగా ప్రతిభను కనబర్చలేదు. దీంతోపాటు తన ఇష్టానుసారంగా హౌస్ లో వ్యవహరిస్తున్నాడు. దీంతో బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్లో అభిజిత్ అటిట్యూట్ పై బిగ్ బాస్ కొరఢా ఝళిపించాడు.
Also Read: రచ్చ కంటిన్యూ.. నాగబాబు స్ట్రాంగ్ పంచ్ కు ప్రకాశ్ రాజ్ కౌంటర్..!
అభిజిత్ లోని వివిధ షేడ్స్ ను బిగ్ బాస్ వీడియోల రూపంలో అందరికీ చూపించాడు. మొనాల్.. హరిక విషయంలో అభిజిత్ షేడ్స్ చూపిస్తూ వరస్ట్ ఫార్మర్ అంటూ బిగ్ బాస్ ప్రకటించాడు. అలాగే అభి అడుగులకు మడుగులు ఒత్తుతూ గేమ్ ఆడుతున్న హరిక కూడా బిగ్ బాస్ నుంచి అక్షింతలు పడ్డాయి.
హోస్ట్ నాగార్జున అయితే అభిజిత్ ను ఓ ఆటఆడేసుకున్నాడు. దీంతో అభిజిత్ హోస్టు నాగార్జునకు.. బిగ్ బాస్ కు సారీ అంటూ మొకాళ్లపడ్డాడు. బిగ్ బాస్ మందలింపుతో వీరి రానున్న ఎపిసోడ్లలో అభిజిత్.. హరిక గేమ్ మారేలా కన్పిస్తోంది. మరో మూడు వారాల్లో గేమ్ ముగియనుండటంతో గేమ్ మరింత ఆసక్తిని రేపుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్