కేసీఆర్ కి కేంద్రమంత్రి కితాబు!

తెలంగాణలో కరోనా వైరస్ ని నియంత్రించడానికి సీఎం కేసీఆర్ సాహసోపేత చర్యలు తీసుకున్నారని, అందుచేత వైరస్ కట్టడిలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా ఉందని కేంద్ర జలశక్తి అభియాన్ మంత్రి రతన్ లాల్ కటారియా పేర్కొన్నారు. కరోనా వైరస్ కేసుల సంఖ్య అదుపులోనే ఉందని.. రాజధాని హైదరాబాద్ లోనే రెడ్ జోన్లు ఉన్నాయని, మిగతా జిల్లాల్లో ఆరెంజ్, గ్రీన్ జోన్లు ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో పగలు లాక్ డౌన్, రాత్రిళ్లు కర్ఫ్యూ పకడ్బందీగా కొనసాగుతోందన్నారు. కరోనా […]

Written By: Neelambaram, Updated On : May 18, 2020 4:21 pm
Follow us on

తెలంగాణలో కరోనా వైరస్ ని నియంత్రించడానికి సీఎం కేసీఆర్ సాహసోపేత చర్యలు తీసుకున్నారని, అందుచేత వైరస్ కట్టడిలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా ఉందని కేంద్ర జలశక్తి అభియాన్ మంత్రి రతన్ లాల్ కటారియా పేర్కొన్నారు.

కరోనా వైరస్ కేసుల సంఖ్య అదుపులోనే ఉందని.. రాజధాని హైదరాబాద్ లోనే రెడ్ జోన్లు ఉన్నాయని, మిగతా జిల్లాల్లో ఆరెంజ్, గ్రీన్ జోన్లు ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో పగలు లాక్ డౌన్, రాత్రిళ్లు కర్ఫ్యూ పకడ్బందీగా కొనసాగుతోందన్నారు. కరోనా కట్టడి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేత చర్యలు చేపట్టారని రతన్ లాల్ కటారియా ఈ సందర్భంగా అభినందించారు.

తెలంగాణలో ఆదివారం నాటికి కరోనా బాధితుల సంఖ్య 1551కి చేరుకుంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 525 మంది చికిత్స పొందుతుండగా.. ఆదివారం మరో 42 మంది ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి అయ్యారు. దీంతో ఆరోగ్యవంతులుగా ఇళ్లకెళ్లినవారి సంఖ్య 992కు చేరింది. ఇప్పటివరకూ మహమ్మారి బారినపడి 34 మంది మరణించారు.