https://oktelugu.com/

Indian Air Force : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) అగ్నివీర్ కు అప్లే చేసుకోండి. అప్లే డేట్, చివరి డేట్ ఇదే..

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్‌ 2025 విడుదలైంది. ఇంటర్ లేదా డిప్లోమా కోర్సులో సంబంధిత స్పెషలైజేషన్ లో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : December 31, 2024 / 08:00 AM IST

    Indian Air Force

    Follow us on

    Indian Air Force : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్‌ 2025 విడుదలైంది. ఇంటర్ లేదా డిప్లోమా కోర్సులో సంబంధిత స్పెషలైజేషన్ లో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఇక దరఖాస్తు ప్రక్రియ జనవరి 7, 2025న ప్రారంభం కానుంది. జనవరి 27 వరకు గడువు విధించారు అధికారులు. ఆసక్తి, అర్హత గల విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్, agnipathvayu.cdac.in/AV ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించిన ఆన్‌లైన్ పరీక్ష మార్చి 22న ప్రారంభమవుతుంది.

    ఇండియన్ ఎయిర్‌ఫోర్స్- అగ్నిపథ్‌ స్కీం కింద అగ్నివీర్ వాయు(01/ 2026) బ్యాచ్ నియామకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని కండీషన్ లు పెట్టింది. ఈ అభ్యర్ధులు తప్పనిసరిగా కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ లేదా మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సులో పాసై ఉండాలి. లేదా ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌తో మొత్తం 50% మార్కులతో, ఆంగ్లంలో 50% మార్కులతో 2 సంవత్సరాల వృత్తి విద్యా కోర్సు పూర్తి చేసి ఉన్న అభ్యర్థులు దీనికి అప్లే చేసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా నిర్దిష్ట శారీరక దారుఢ్య, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలని తెలిపారు. అలాగే దరఖాస్తుదారుల వయోపరిమితి జనవరి 01, 2005 నుంచి జులై 01, 2008 మధ్య జన్మించిన వారు మాత్రమే ఈ నియామకాలకు అప్లే చేసుకోవచ్చు.

    ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 27, 2025వ తేదీలోగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు జనవరి 7, 2025వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ పరీక్ష ఫీజు కింద రూ.550 తప్పనిసరిగా చెల్లించాల్సిందే. ఫేజ్-1 (ఆన్‌లైన్ రాత పరీక్ష), ఫేజ్-2 (ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3 (మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్) వంటివి ఉంటాయి. అయితే ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

    85 నిమిషాల ఆన్‌లైన్ పరీక్షలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ (10+2 CBSE సిలబస్), రీజనింగ్ & జనరల్ అవేర్‌నెస్ (రాగా)లు కూడా ఉంటాయి. మార్కింగ్ విధానం విషయానికి వస్తే ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు, ప్రయత్నించని ప్రశ్నలకు సున్నా మార్కులు, ఇక ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత ఉంటుందని వివరించారు అధికారులు.