https://oktelugu.com/

Surya : సూర్య చెయ్యాల్సిన సినిమా ఆ హీరో చేతుల్లోకి..’కంగువ’ ఎఫెక్ట్ మామూలుగా లేదుగా..ఇంత అవమానమా!

సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరు సూర్య. తెలుగు రాష్ట్రాలతో పాటు, అన్ని రాష్ట్రాల్లో సరైన మార్కెట్ ఉన్న హీరో ఈయన. కానీ దురదృష్టం ఇప్పుడు ఈయన ఇంటి పేరుగా మారిపోయింది.

Written By:
  • Vicky
  • , Updated On : December 31, 2024 / 07:59 AM IST

    Surya

    Follow us on

    Surya : సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరు సూర్య. తెలుగు రాష్ట్రాలతో పాటు, అన్ని రాష్ట్రాల్లో సరైన మార్కెట్ ఉన్న హీరో ఈయన. కానీ దురదృష్టం ఇప్పుడు ఈయన ఇంటి పేరుగా మారిపోయింది. ఆయన రేంజ్ హిట్ కొట్టి పదేళ్లు దాటిపోయింది. ఈ పదేళ్లలో ఆయన చేసిన సినిమాలు ఒకటి రెండు యావేరేజ్ రేంజ్ లో ఆడాయి కానీ, మిగిలినవన్నీ ఫ్లాపులే. మంచి కంటెంట్ తో తీసిన సినిమాలు మాత్రం లాక్ డౌన్ సమయంలో ఓటీటీ లో విడుదలయ్యాయి. వాటికి అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇవి థియేటర్స్ లో విడుదల అయ్యుంటే ఆయన కెరీర్ లోనే పెద్ద హిట్స్ గా నిలిచేవి. ఎంత దురదృష్టమో మీరే గమనించండి. అయితే రీసెంట్ గానే ‘కంగువ’ తో మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ పాన్ ఇండియన్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

    మొదటి రోజే వంద కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకుంటుంది అనుకున్న ఈ చిత్రం, ఫుల్ రన్ లో అతి కష్టం మీద ఆ మార్కుని అందుకుంది. ఇదంతా పక్కన పెడితే సూర్య ఈ సినిమాతో పాటు అప్పట్లో ‘వనంగాన్’ అనే చిత్రం సమాంతరంగా చేసేవాడు. ఈ చిత్రానికి ‘బాలా’ దర్శకత్వం వహించాడు. సుమారుగా 20 శాతం కి పైగా షూటింగ్ ని పూర్తి చేసారు. అయితే సినిమా కంటెంట్ కి తగ్గట్టు ఎక్కువ శాతం బహిరంగ ప్రదేశాల్లోనే చెయ్యాల్సి రావడం తో, అభిమానులు షూటింగ్ ని చూసేందుకు భారీగా వచ్చేవారు. దీనివల్ల షూటింగ్ కి చాలా అంతరాయం కలిగేది. సూర్య సమయం కూడా చాలా వృధా అయ్యింది. దీంతో ఇలా అయితే కష్టం అని భావించిన సూర్య, బాలా ఈ చిత్రాన్ని ఆపేయాలని నిర్ణయించుకున్నారు. పూర్తిగా ఈ చిత్రాన్ని ఆపేసారేమో అని అందరూ అనుకున్నారు.

    కానీ ఈ చిత్రం ఇప్పుడు ప్రముఖ తమిళ యంగ్ హీరో అరుణ్ విజయ్ చేతుల్లోకి వెళ్ళింది అని నిన్ననే తెలిసింది. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా, ‘ప్రేమలు’ హీరోయిన్ మమిత బైజు, రోషిని ప్రకాష్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 10వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. అదే రోజున రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ చిత్రం కూడా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు రామ్ చరణ్ ‘బ్రూస్లీ – ది ఫైటర్’ చిత్రం లో అరుణ్ విజయ్ విలన్ గా నటించాడు. ఇప్పుడు అదే అరుణ్ విజయ్ రామ్ చరణ్ కి పోటీగా రాబోతున్నాడు. ‘వనంగాన్’ చిత్రం పై కూడా తమిళ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. చూడాలి మరి సూర్య ఈ చిత్రాన్ని వదిలి తప్పు చేశాడా?, లేదా వదిలి మంచి పని చేశాడా అనేది.