https://oktelugu.com/

NTR : నెట్ ఫ్లిక్స్ లో ప్రపంచ రికార్డుని నెలకొల్పిన ఎన్టీఆర్ ‘దేవర’..భవిష్యత్తులో ఏ హీరోకి ఇది సాధ్యం కాదేమో!

ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై, బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని దక్కించుకున్న పాన్ ఇండియన్ చిత్రాల్లో ఒకటి ఎన్టీఆర్ నటించిన 'దేవర'.

Written By:
  • Vicky
  • , Updated On : December 31, 2024 / 08:06 AM IST

    NTR

    Follow us on

    NTR : ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై, బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని దక్కించుకున్న పాన్ ఇండియన్ చిత్రాల్లో ఒకటి ఎన్టీఆర్ నటించిన ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద సుమారుగా 370 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చింది. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా, హిందీ లో కూడా ఈ సినిమాకి భారీ వసూళ్లు వచ్చాయి. ‘ఆచార్య’ లాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమా తర్వాత, కొరటాల శివ ఈ రేంజ్ కంబ్యాక్ ఇస్తాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు. సుమారుగా నెల రోజుల వరకు ఈ చిత్రానికి అద్భుతమైన థియేట్రికల్ షేర్ వసూళ్లు వచ్చాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆది, సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ సినిమాల్లో మంచి లాంగ్ రన్ ని తెచ్చుకున్న చిత్రం ఇదే. అందులో ఎలాంటి సందేహం లేదు.

    అయితే ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసి దాదాపుగా 50 రోజులు పూర్తి అయ్యింది. ఈ 50 రోజుల నుండి ఈ సినిమా టాప్ 10 లో నాన్ స్టాప్ గా ట్రెండ్ అవుతూనే ఉంది. ముందుగా హిందీ వెర్షన్ ని ఆపి, మిగిలిన ప్రాంతీయ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసారు. ఆ తర్వాత కొన్ని రోజులకు హిందీ వెర్షన్ ఆడియో ని కూడా జత చేసారు. తెలుగు లో వచ్చిన వ్యూస్ కంటే, హిందీ లో వచ్చిన వ్యూస్ ఎక్కువ. అదే విధంగా ఈ చిత్రాన్ని అక్కడి ఆడియన్స్ థియేటర్స్ లో కంటే ఎక్కువగా ఓటీటీ లోనే చూస్తున్నారు. ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండడంతో మేకర్స్ రీసెంట్ గానే ఇంగ్లీష్ వెర్షన్ ఆడియో ని కూడా జత చేసారు. రెస్పాన్స్ మరింత పెరిగింది. త్వరలోనే ఇతర దేశాలకు సంబంధించిన భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

    ఇది ఇలా ఉండగా ఈ ఏడాది నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న టాప్ 5 చిత్రాలలో ‘దేవర’ చిత్రం నాల్గవ స్థానాన్ని దక్కించుకుంది. మిగిలిన సినిమాలన్నీ అంతర్జాతీయ సినిమాలు మాత్రమే ఉండడం గమనార్హం. అన్ని సినిమాల మధ్య ఒకే ఒక్క తెలుగు సినిమా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. #RRR తర్వాత ఎన్టీఆర్ కి ప్రపంచవ్యాప్తంగా ఎంత మంచి గుర్తింపు వచ్చిందో చెప్పడానికి ‘దేవర’ మరో ఉదాహరణ. అయితే #RRR చిత్రం నెట్ ఫ్లిక్స్ లో దాదాపుగా ఏడాది పాటు టాప్ 10 లో ట్రెండ్ అయ్యింది. ఆ రేంజ్ లో ‘దేవర’ ట్రెండ్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగష్టు 15 వ తారీఖున విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.