అపెక్స్ కౌన్సిల్: కేసీఆర్, జగన్ ఏం చెప్పారంటే?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో తెలంగాణ, ఏపీ మధ్య ఎన్నో జలవివాదాలు ఉన్నాయి. ఆ తర్వాత ఏపీ, తెలంగాణ రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయాక నీటివివాదాలు ఎక్కువయ్యాయి. అప్పట్లో సీఎం చంద్రబాబు నాయుడు, సీఎం కేసీఆర్ ఉప్పునిప్పులా ఉండేవారు. దీంతో నీటి సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా అలాగే ఉన్నాయి. ఏపీకి సీఎంగా జగన్మోహన్ రెడ్డి అయ్యాక పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చినట్లు కన్పిస్తోంది. Also Read: మోడీతో జగన్.. ఏం ఏం చర్చించారంటే? సీఎం కేసీఆర్ కు […]

Written By: NARESH, Updated On : October 6, 2020 6:15 pm
Follow us on


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో తెలంగాణ, ఏపీ మధ్య ఎన్నో జలవివాదాలు ఉన్నాయి. ఆ తర్వాత ఏపీ, తెలంగాణ రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయాక నీటివివాదాలు ఎక్కువయ్యాయి. అప్పట్లో సీఎం చంద్రబాబు నాయుడు, సీఎం కేసీఆర్ ఉప్పునిప్పులా ఉండేవారు. దీంతో నీటి సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా అలాగే ఉన్నాయి. ఏపీకి సీఎంగా జగన్మోహన్ రెడ్డి అయ్యాక పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చినట్లు కన్పిస్తోంది.

Also Read: మోడీతో జగన్.. ఏం ఏం చర్చించారంటే?

సీఎం కేసీఆర్ కు జగన్మోహన్ రెడ్డి మధ్య మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న పలు సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకున్నారు. అయితే నీటి పంపకాలు, ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో మాత్రం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సయోధ్య కుదరడం లేదు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న నీటి ప్రాజెక్టులపై తెలంగాణ.. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు. దీంతో ఇదికాస్తా ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేలా కన్పిస్తోంది.

ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల జలవివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం మధ్యవర్తిత్వం చేస్తోంది. ఇరురాష్ట్రాల సీఎంలను పలుమార్లు పిలిచి మాట్లాడింది. తాజాగా ఇరురాష్ట్రాల సీఎంలతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ అధ్యక్షత ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎంలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ వాదనలు విన్పించారు. సుమారు రెండు గంటలపాటు ఈ సమావేశం జరిగింది.

కృష్ణా జలాల వివాదంపై ఇరురాష్ట్రాలు గట్టిగా తమ వాదనలు వినిపించినట్లు తెలుస్తోంది. నాలుగు అంశాలను ఏజెండాగా నిర్ణయించినప్పటికీ వాటికి అనుబంధంగా అనేక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా కేటాయింపుల్లేకుండా పరిధిని నోటిఫై చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే ఏపీ మాత్రం నోటిఫై చేయాలని పట్టుబడుతోంది.

Also Read: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సీఎం జగన్ శుభవార్త..?

అదేవిధంగా ఇప్పటికే ఉన్న నాగార్జున సాగర్‌తోపాటు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణను తమకే అప్పగించాలని తెలంగాణ కోరిగా.. రెండు ప్రాజెక్టుల నిర్వహణను పూర్తిగా బోర్డుకే అప్పగించాలని ఏపీ డిమాండ్ చేస్తోంది. ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు సైతం పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీంతో ఇరురాష్ట్రాల వాదనలు విన్న అపెక్స్ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది ఆసక్తికరంగా మారింది.