https://oktelugu.com/

బంగార్రాజుకి క్లారిటీ లేదు.. బాధలో డైరెక్టర్ !

యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మంచి టాలెంటెడ్ డైరెక్టర్.. కథలు రాయడంలో కూడా అతనికి మంచి పట్టు ఉందని ఇండస్ట్రీలో మంచి నేమ్ ఉంది. కానీ పరిస్థితులు మారాయి. దాదాపు రెండు సంవత్సరాలకు పైగా అక్కినేని కాంపౌండ్ లో ఓ కథ రాస్తూ.. దాన్ని ఒప్పించలేక.. సినిమా చేస్తాను అని ఒప్పందాన్ని వదిలిపెట్టలేక నానాకష్టాలు పడుతున్నాడు కళ్యాణ్ కృష్ణ. సహజంగా నాగ్ ను స్క్రిప్ట్ విషయంలో ఒప్పించడం అంటే బాగా కష్టం అనే పేరు ఉంది, దీనికి […]

Written By:
  • admin
  • , Updated On : October 6, 2020 / 04:23 PM IST
    Follow us on


    యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మంచి టాలెంటెడ్ డైరెక్టర్.. కథలు రాయడంలో కూడా అతనికి మంచి పట్టు ఉందని ఇండస్ట్రీలో మంచి నేమ్ ఉంది. కానీ పరిస్థితులు మారాయి. దాదాపు రెండు సంవత్సరాలకు పైగా అక్కినేని కాంపౌండ్ లో ఓ కథ రాస్తూ.. దాన్ని ఒప్పించలేక.. సినిమా చేస్తాను అని ఒప్పందాన్ని వదిలిపెట్టలేక నానాకష్టాలు పడుతున్నాడు కళ్యాణ్ కృష్ణ. సహజంగా నాగ్ ను స్క్రిప్ట్ విషయంలో ఒప్పించడం అంటే బాగా కష్టం అనే పేరు ఉంది, దీనికి తోడు, నాగ్ ఇతర పనులతో ఎప్పటికప్పుడు బిజీగా ఉంటూ.. కళ్యాణ్ కృష్ణ చెప్పే స్క్రిప్ట్ మీద కూడా దృష్టి పెట్టలేకపోతున్నాడట. పోనీ వేరే కథ చెబితే.. వద్దు, బంగార్రాజు కథనే చేద్దాం అంటున్నాడట.

    Also Read: మహేష్ బాబునే ఇంతలా భయపెట్టారంటే?

    మరి ఆ బంగార్రాజుతో నాగ్ ఎప్పుడు ఒప్పించాలి.. ఎప్పుడు సినిమా తీయాలి అని కళ్యాణ్ కృష్ణ ఫీల్ అవుతోనట్లు తెలుస్తోంది. ఎన్ని నెలలు చేసినా కథ నచ్చకపోవడంతో కళ్యాణ్ కృష్ణ కాస్త లోలోపల ఇబ్బంది పడుతున్నాడని తెలుస్తోంది. కళ్యాణ్ కృష్ణకి ఈ గతి పట్టడానికి కారణం రవితేజతో చేసిన ‘నేల టికెట్’ సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడమే. నేల టికెట్ సినిమా బాగా నిరుత్సాహ పరిచింది. ఆ దెబ్బకు కళ్యాణ్ కృష్ణ మొత్తానికి రెండేళ్లు నుండి కథను ఒప్పించలేక అక్కినేని కాంపౌండ్‌ నుండి బయటకు రాలేకపోతున్నాడు. నిజానికి ఎప్పుడో గత ఏడాదే సినిమాని సెట్స్ పైకి తీసుకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్న కళ్యాణ్ కృష్ణకు ఈ సినిమా మరింతగా ఆలస్యం అవుతుండటంతో కళ్యాణ్ బాగా నిరాశకు లోనవుతున్నాడు.

    Also Read: బిగ్‌ బాస్‌ కు నాగార్జున దూరం.. ఏం జరుగనుంది?

    మరి నాగార్జున బంగార్రాజు మీదకు ఎప్పుడు వస్తాడో ఇంకా క్లారిటీ లేదు. అసలు కళ్యాణ్ కృష్ణ ఈ సినిమా నుండి ఎప్పుడు బయటకు వస్తాడో.. అసలు ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ సినిమా ఇలా వాయిదా పడుతూనే వస్తోంది. స్టార్ట్ చేద్దాం అనుకున్న ప్రతిసారి నాగ్ చేతులు ఎత్తేస్తున్నాడు. అనుకున్న సమయానికి బంగార్రాజు ఎప్పుడూ స్టార్ట్ అవ్వలేదు. అక్టోబర్ మొదటి వారంలో ఈ సినిమాను మొదలుపెట్టి, సింగిల్ షెడ్యూల్ లోనే షూటింగ్ ను పూర్తి చేసి… అన్ని కుదిరితే వచ్చే సంక్రాంతికి బంగార్రాజు సినిమాని రిలీజ్ చేయాలని కళ్యాణ్ కృష్ణ పర్ఫెక్ట్ గా ప్లాన చేసుకుంటే.. నాగ్ మాత్రం ఈ సినిమాని ఇప్పట్లో మొదలుపెట్టేలా లేడు. నాగ్ బిగ్ బాస్ కి తన డేట్స్ మొత్తం ఇచ్చి.. మళ్ళీ వేరే సినిమాకి కూడా తన డేట్స్ ఇచ్చేశాడు.