సోషల్ మీడియాలో నిన్నటి నుంచి కాజల్ ప్రేమ.. పెళ్లిపై చర్చ జరుగుతోంది. కాజల్ అగర్వాల్ నిన్న తన ఇన్ స్ట్రాగ్రామ్లో కాదల్ సింబల్ ను పోస్టు చేసింది. అయితే ప్రేమ.. పెళ్లిపై కాజల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో కొందరు నెటిజన్లు ఆమె కుదిరిందంటూ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. గతంలోనూ కాజల్ పెళ్లిపై అనేక పుకార్లు వచ్చినట్లే ఇది కూడా అని అభిమానులు లైట్ తీసుకున్నారు.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’ ఫాలో అవుతున్న ‘లాజిక్’ ఇదేనా..!
నిన్నటి నుంచి సోషల్ మీడియాలో కాజల్ పెళ్లిపై వస్తున్న వార్తలను నేడు ఆమె నిజం చేసి అందరికీ షాకిచ్చింది. తన ఇన్ స్ట్రాగ్రాంలో కాజల్ తన పెళ్లిపై ఒక ప్రకటన విడుదల చేసి పెళ్లి ఫిక్సందనే విషయాన్ని ఖరారు చేసింది. అంతేకాకుండా పెళ్లి డేట్ ను అనౌన్స్ చేసింది. అక్టోబర్ 30న ముంబైకి చెందిన గౌతమ్ కిచ్లుతో తన వివాహం జరుగబోతుందని కాజల్ తన ఇన్ స్ట్రాగ్రాంలో పోస్టు చేసింది.
పెళ్లి వేడుకలకు కుటుంబ సభ్యులు మినహా అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపింది. త్వరలోనే గౌతమ్ తో తాను కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్నానని.. ఇది తనకు చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుందని చెప్పుకొచ్చింది. ఇన్నాళ్లుగా తనను ప్రేమతో ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పింది. మీ అందరీ ఆశీర్వదం తనకు కావాలని కోరింది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతూ అభిమానులను ఎంటటైన్మెంట్ చేస్తానంటూ ప్రకటించింది.
కాజల్ ఈ విషయాన్ని అనౌన్స్ చేసిన వెంటనే సెలబ్రెటీలంతా ఆమెకు విషెస్ చెప్పారు. సమంత, శృతిహాసన్ తోపాటు పలువురు హీరోయిన్లు కాజల్ కు కంగ్రాట్స్ చెప్పారు. చిత్రసీమలోని ప్రముఖులంతా ఆమె ముందస్తు పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఆమె అభిమానులు మాత్రం కొంత నిరుత్సాహానికి గురవుతున్నారు.
Also Read: పాకిస్తాన్ – ఇండియా యుద్ధం నేపథ్యంలో ఎన్టీఆర్ సినిమా !
కాజల్ ఇప్పుడే పెళ్లి చేసుకుంటున్నావా? ఇంకో రెండేళ్లు ఆగొచ్చు కదా? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే కాజల్ పెళ్లి చేసుకున్నాక కూడా సినిమాల్లో ఉంటుందని అధికారికంగా ప్రకటించడంపై అభిమానులు హర్షం వెలిబుచ్చుతున్నారు. కాజల్ కంటే ముందే ఆమె చెల్లి నిషా అగర్వాల్ పెళ్లి చేసుకోవడంతోపాటు ఓ బిడ్డకు తల్లి కూడా అయింది. ఇక 35ఏళ్ల వయస్సులో ఈ ముదురుభామ పెళ్లిపీఠలెక్కుతుండటం గమనార్హం.