బీజేపీలో చేరికలపై వీర్రాజు ‘లెక్కే’ వేరప్పా..!

ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా నియామకమైన రోజు నుంచే సోము వీర్రాజు దూకుడుగా వెళ్తున్నారు..   తనదైన మార్క్ తో ఏపీ రాజకీయాల్లో దూసుకెళుతున్నారు. ఇంతకముందున్న అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కంటే సోము వీర్రాజే బెటర్ అనే పేరు తెచ్చుకున్నారు. బీజేపీ శ్రేణుల్లోనూ.. అధిష్టానం దృష్టిలోనూ సోము వీర్రాజు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అధిష్టానం కూడా వీర్రాజుకు ఫ్రీ హ్యండ్ ఇవ్వడంతో తనదైన శైలిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాడు. Also Read: అంతర్వేది ఎఫెక్ట్.. ఓ మంత్రికి పదవి కట్? ఏపీలో […]

Written By: NARESH, Updated On : September 17, 2020 5:50 pm
Follow us on

ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా నియామకమైన రోజు నుంచే సోము వీర్రాజు దూకుడుగా వెళ్తున్నారు..   తనదైన మార్క్ తో ఏపీ రాజకీయాల్లో దూసుకెళుతున్నారు. ఇంతకముందున్న అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కంటే సోము వీర్రాజే బెటర్ అనే పేరు తెచ్చుకున్నారు. బీజేపీ శ్రేణుల్లోనూ.. అధిష్టానం దృష్టిలోనూ సోము వీర్రాజు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అధిష్టానం కూడా వీర్రాజుకు ఫ్రీ హ్యండ్ ఇవ్వడంతో తనదైన శైలిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాడు.

Also Read: అంతర్వేది ఎఫెక్ట్.. ఓ మంత్రికి పదవి కట్?

ఏపీలో బీజేపీ ఒక్క ఎమ్మెల్సే, ఎంపీ సీటు కూడా లేకుండా రాజకీయాలను హిటెక్కిస్తోంది. జనసేన పార్టీతో కలిసి జగన్  సర్కార్ ను ఢీకొడుతోంది. ప్రజా వ్యతిరేక సమస్యలపై నిలదీస్తూ టీడీపీని కనుమరుగు చేస్తోంది. వైసీపీకి తామే ప్రత్యామ్నాయం అనేలా బీజేపీ వ్యవహరిస్తోంది. ఏపీలో బీజేపీ దూసుకెళుతుండటంతో పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ అధికారంలో ఉండటంతో తమకు మంచి పదవులు దక్కుతాయని భావించి ఆ పార్టీలో చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారు.

బీజేపీ అధిష్టానం వలస నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నా..వీర్రాజు మాత్రం బ్రేకులేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీలో చంద్రబాబు అనుకూల నేతలు ఎక్కువగా అయ్యారని భావిస్తున్నారు. వలసలు వచ్చే నేతల్లో ఎక్కువగా టీడీపీకి చెందినవారే ఉంటుండటంతో వారిని పార్టీలో చేర్చుకునేందుకు వీర్రాజు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే ఏపీలో పార్టీ బలోపేతం అవుతుందని ఇలాంటి సమయంలో వలసలను ప్రోత్సహిస్తే క్యాడర్లో తప్పుడు సంకేతాలు వెళుతాయని వీర్రాజు భావిస్తున్నారు.

దీంతో టీడీపీకి చెందిన నేతలను కాకుండా మిగతా పార్టీల నుంచి వచ్చేవారికే వీర్రాజు పెద్దపీఠ వేస్తున్నారు. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ భావంజాలం ఉన్న నేతలను పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఇప్పట్లో ఎన్నికలు కూడా లేకపోవడంతో పార్టీ బలోపేతంపై ఆచితుచి ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీలో నియమించిన కొత్త కమిటీలోనూ అనుమానాస్పద వ్యక్తులను ఆయన పక్కన పెట్టారు. పార్టీ కోసం కష్టపడే వారికి.. ప్రజల బాధలను ఎలుగెత్తి చాటేవారికి.. ప్రజాసమస్యలపై ప్రభుత్వంతో పోరాడే  వారికే కమిటీలో ప్రాధాన్యం కల్పించారు.

Also Read: దుర్గగుడి ఆ మూడు సింహాలు ఆయన ఇంట్లోనే ఉంటాయి: మాజీ మంత్రి సంచలనం

ఏపీ అధ్యక్షుడిగా వీర్రాజు ఉన్నంతకాలం కమలం గూటికి వలస నేతలు చేరడం అంత ఈజీ కాదనే సంకేతాలను శ్రేణుల్లోకి పంపుతున్నారు. దీంతో బీజేపీ శ్రేణులు సైతం వీర్రాజుకు మద్దతుగా నిలుస్తున్నారు.