కరోనా టెస్టుల్లో టాపే.. రికవరీలో..!

రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారిని గుర్తించేందుకు ప్రభుత్వం అధిక సంఖ్యలో పరీక్షలు చేస్తోంది. దేశంలోనే అత్యధిక కరోనా పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా ప్రభుత్వం తరపున ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు ఊదరగొడుతున్నారు. ఒక మిలియన్ ప్రజలకు 1,274 మంది అనుమానితుల స్వాబ్ నమునాలను సేకరించి పరీక్షలు చేస్తున్నారు. కరోనా వైరస్ రాష్ట్రంలో ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకూ 68,034 మందికి పరీక్షలు నిర్వహించి 1,097 మందికి వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. కరోనా వైరస్ వ్యాప్తి […]

Written By: Neelambaram, Updated On : April 26, 2020 5:36 pm
Follow us on


రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారిని గుర్తించేందుకు ప్రభుత్వం అధిక సంఖ్యలో పరీక్షలు చేస్తోంది. దేశంలోనే అత్యధిక కరోనా పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా ప్రభుత్వం తరపున ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు ఊదరగొడుతున్నారు. ఒక మిలియన్ ప్రజలకు 1,274 మంది అనుమానితుల స్వాబ్ నమునాలను సేకరించి పరీక్షలు చేస్తున్నారు. కరోనా వైరస్ రాష్ట్రంలో ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకూ 68,034 మందికి పరీక్షలు నిర్వహించి 1,097 మందికి వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు.

కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో, దీని భారినపడి కోలుకుంటున్న బాధితుల సంఖ్యలో, అదేవిధంగా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్యలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మెరుగెన పనితీరు ప్రదర్శించలేకపోయింది. కరోనా పరీక్షల గురించి ఏకరు పెట్టేవారు ఈ విషయాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదనేది ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కేవలం పరీక్షలు చేసినంత మాత్రాన వ్యాధికి చికిత్స చేసినట్లు కాదు, ఇతర రాష్ట్రాల కంటే కరోనా మరణాల రేటు తగ్గించి లేక వైరస్ భారినపదిన వారిని తొందరగా కోలుకునేటట్లు చేసి ఆ విషయం ప్రచారం చేసుకుంటే దానికి ఓ అర్థం ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

కరోనా వైరస్ వ్యాప్తిలో తెలంగాణ కంటే తక్కువ కేసులతో దేశంలో 9వ స్థానంలో ఉన్న రాష్ట్రం మరణాల విషయంలో 5వ స్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే ఐదు రాష్ట్రాలలో అత్యధిక మరణాలు (31 మంది) ఏపీ లోనే సంభవించాయి. తమిళనాడులో మొత్తం కేసులు 1,755 నమోదవగా మరణించింది కేవలం 22 మంది మాత్రమే. దేశంలోనే మొట్టమొదటి కేసు కేరళలో గుర్తించినా ఆ రాష్ట్రం వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంతో 450 కేసులు మాత్రమే నమోదయ్యాయి, మరణించిన వారు ముగ్గురే ఉన్నారు. నిన్నటి వరకూ మన కంటే ఎక్కువ కేసులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 25 గానే ఉంది.

మరోవైపు కరోనా వైరస్ భారినపడి కోలుకున్న వారి సంఖ్యా రాష్ట్రంలో తక్కువగానే ఉంది. కేరళ రాష్ట్రంలో వైరస్ భారినపడి కోలుకున్న వారు 73.6 శాతంగా ఉంటే, తమిళనాడు లో 49.3 శాతం, కర్ణాటక లో 32.1 శాతం, తెలంగాణ లో 29.6 శాతంగా ఉంటే ఏపీ మాత్రం 16.8 శాతంగా ఉంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వైద్యులు, పారామెడికల్ సిబ్బంది రాష్ట్రంలో అధికంగా వైరస్ భారిన పడ్డారనే వాదనలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రచారంపై దృష్టి తగ్గించి వైరస్ వ్యాప్తి నిరోధించడంపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది.