మూడు ాజధానుల అంశం న్యాయపరమైన చిక్కులతో ముడిపడిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించిన పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్టీఏ చట్టం రద్దు బిల్లులను రాజధాని రైతులు హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం గతంలోనే స్టేటస్ కో విధించింది.
విజిలెన్స్ కార్యాలయాలను తరలించాలని ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు అప్పట్లో సస్పెండ్ చేసింది. ప్రస్తుత త్రిసభ్య ధర్మాసనం స్టేటస్ కో ఎత్తివేసేందుక నిరాకరించింది. సుప్రీంకోర్టుకు ప్రభుత్వం వెళ్లినా 2020 ఆగస్టు 26న స్టేటస్ కోను ఎత్తివేసేందుకు నిరాకరించింది. కేవలం విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది.
హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ ఏడాది మేలో ఈ కేసు విచారణ చేపట్టినప్పటికి కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగస్టు 23న విచారణను వాయిదా వేసింది. కనీసం విచారణ పూర్తి అయి తీర్పు వచ్చేందుకు వచ్చే ఏడాది జనవరి వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ తరుణంలో మూడు రాజధానుల అంశం కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రస్తావించినప్పటికి ఎటువంటి ప్రయోజనం లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. అయినప్పటికి మూడు రాజధానుల గురించే జగన్ కేంద్రానికి విన్నవించారని ప్రచారం చేస్తున్నారు.