పీసీసీ చీఫ్ పై ఉత్కంఠ? : ఢిల్లీకి రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త చీఫ్ వచ్చే రోజులు దగ్గరపడినట్టే కనిపిస్తున్నాయి. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఖాయమైనట్టే వార్తలు రావడం..నియామకం ఆగిపోవడం కొద్దినెలలుగా సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది. టీపీసీసీ అధ్యక్షుడి నియామకం మరోసారి తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ హైకమాండ్ ఈ అంశంపై ఫోకస్ పెట్టింది. దీంతో అతి త్వరలోనే కొత్త అధ్యక్షుడు నియామకం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పంజాబ్ పార్టీలోని వివాదాన్ని పరిష్కరించేందుకు ఏర్పాటైన […]

Written By: NARESH, Updated On : June 12, 2021 5:08 pm
Follow us on

తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త చీఫ్ వచ్చే రోజులు దగ్గరపడినట్టే కనిపిస్తున్నాయి. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఖాయమైనట్టే వార్తలు రావడం..నియామకం ఆగిపోవడం కొద్దినెలలుగా సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది.

టీపీసీసీ అధ్యక్షుడి నియామకం మరోసారి తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ హైకమాండ్ ఈ అంశంపై ఫోకస్ పెట్టింది. దీంతో అతి త్వరలోనే కొత్త అధ్యక్షుడు నియామకం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పంజాబ్ పార్టీలోని వివాదాన్ని పరిష్కరించేందుకు ఏర్పాటైన కమిటీ ఒక ఫార్ములాను రూపొందించిందని..దీన్ని అమలు చేసిన వెంటనే తెలంగాణపై దృష్టి సారించే అవకాశం ఉందని ఢిల్లీలో పార్టీ ముఖ్య నేత తెలిపారు.

ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. టీపీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారిలో అందరికంటే ముందున్నారు రేవంత్. ఆయన శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకుంటున్నారు.

దీంతో మరోసారి తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ పోస్టును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయబోతోందనే ప్రచారం మొదలైంది. ఢిల్లీ వెళ్లిన రేవంత్ ఎవరెవరితో భేటి కానున్నారు? ఏయే అంశాలపై చర్చించనున్నారు ? అన్నది ఆసక్తిగా మారింది. ఈ రెండు మూడు రోజుల్లోనే టీపీసీసీ ప్రకటన ఉండొచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి.