https://oktelugu.com/

ఇంతకీ తిరుపతిలో బలం జనసేన/బీజేపీలో ఎవరికుంది?

ఏపీలోని రాజకీయ పార్టీల ఫోకస్‌ అంతా ఇప్పుడు తిరుపతి మీదనే. ఇంకా తిరుపతి లోక్‌సభ స్థానానికి నోటిఫికేషన్‌ రానే లేదు కానీ.. పార్టీలు అక్కడ క్యాంపులు నిర్వహిస్తున్నాయి. ముఖ్య నేతలంతా అక్కడే తిష్టవేశారు. ఈ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని అన్ని రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. గత ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన బీజేపీ సైతం తిరుపతి సీటను తమ ఖాతాలో వేసుకోవాలని ఆరాటపడుతోంది. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలే తమకు కలిసివస్తాయనే […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 22, 2021 / 02:13 PM IST
    Follow us on


    ఏపీలోని రాజకీయ పార్టీల ఫోకస్‌ అంతా ఇప్పుడు తిరుపతి మీదనే. ఇంకా తిరుపతి లోక్‌సభ స్థానానికి నోటిఫికేషన్‌ రానే లేదు కానీ.. పార్టీలు అక్కడ క్యాంపులు నిర్వహిస్తున్నాయి. ముఖ్య నేతలంతా అక్కడే తిష్టవేశారు. ఈ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని అన్ని రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. గత ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన బీజేపీ సైతం తిరుపతి సీటను తమ ఖాతాలో వేసుకోవాలని ఆరాటపడుతోంది. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలే తమకు కలిసివస్తాయనే ధీమాతో ఉంది. ప్రధానంగా తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ తమ పరిస్థితి మెరుగుపడాలని కోరుకుంటోంది. ఇందుకు జనసేన బలం కూడా తమకు కలిసి వస్తుందని యోచిస్తోంది.

    Also Read: నాయకత్వ మార్పు సీనియర్లకు ఇష్టం లేదా..: అందుకే ఈ సైలెంటా..!

    ఎవరు ఏమన్నా ఏపీలో బీజేపీ–జనసేన మిత్రపక్షం. కానీ.. ఈ తిరుపతి బైపోల్‌ విషయంలోనే ఆ మిత్రపక్షం కాస్త ప్రతిపక్షం అయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఏమాత్రం ఓటు బ్యాంకు లేని తిరుపతిలో తమ పార్టీ పోటీచేస్తుందని బీజేపీ చెబుతుండగా.. ఇంతో అంతో తమ పార్టీకే ఓటు బ్యాంకు ఉందని.. అందుకే తమ అభ్యర్థినే బరిలో దింపుతామని జనసేన మాట్లాడుతోంది.

    ఈ నేపథ్యంలో నేడు పవన్ కళ్యాణ్ తిరుపతికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ జరిగే పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. తిరుపతి అభ్యర్థి ఎంపిక అంశంపై ఈ సమావేశంలో జనసేన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్‌లో తాము పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చామనే విషయాన్ని గుర్తు చేస్తున్న జనసేన నేతలు.. తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తమకు ఇవ్వాలని బీజేపీని కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.

    Also Read: రాష్ట్రంలో ఎన్నికల వే‘ఢీ’.. ఊపందుకున్న సం‘గ్రామం’

    ఏపీలో తమ బలం ఎంతవరకు ఉందనే దానిపై అధికార వైసీపీకి తెలియజేయాలనే యోచనలో ఉన్న జనసేన.. ఇందుకు తిరుపతి ఉప ఎన్నికను ఉపయోగించుకోవాలని ఉబలాటపడుతోంది. ఇప్పటికే జనసేన తరపున తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న అభ్యర్థుల జాబితాను కూడా ఆ పార్టీ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి నేడు తిరుపతి చేరుకున్న పవన్ కళ్యాణ్.. తిరుపతిలో పోటీ చేసే అంశంపై జనసేన శ్రేణులకు ఏ రకమైన క్లారిటీ ఇస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. ఈ సమావేశంతోనైనా ఈ సందిగ్ధానికి తెరపడుతుండా చూడాలి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్