Rajamouli- RRR: ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందంటారు. రాజమౌళి సక్సెస్ వెనుక మాత్రం ముగ్గురు ఆడవాళ్లు ఉన్నారట. తనను కొట్టగల వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే… వారే అని రాజమౌళి తెలియజేశారు. రాజమౌళి దేశం మెచ్చిన దర్శకుడు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఆయన ఇమేజ్ ప్రపంచ స్థాయికి చేరింది. గత ఏడాది విడుదలైన ఆర్ ఆర్ ఆర్ మూవీ అంతర్జాతీయ సినిమా వేదికలపై సత్తా చాటుతుంది. పలు అవార్డ్స్ కొల్లగొట్టింది. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి గానూ రాజమౌళి ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్స్ అవార్డు అందుకున్నాడు. మరొక విశేషం ఏమిటంటే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కి రెండు విభాగాల్లో ఆర్ ఆర్ ఆర్ నామినేట్ అయ్యింది.

నాటు నాటు సాంగ్ రచయిత చంద్రబోస్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కి నామినేట్ అయ్యారు. ఈ అవార్డుల వేడుకకు ఆర్ ఆర్ ఆర్ టీమ్ హాజరవుతున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ఆశలు కూడా సజీవంగా ఉన్నాయి. మరి ఇంతటి అరుదైన విజయాలు అందుకుంటున్న రాజమౌళి సక్సెస్ వెనుక ముగ్గురు ఆడవాళ్లు ఉన్నారట. ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ విషయం వెల్లడించారు. నా మీద అత్యంత ప్రభావం చూపిన మొదటి వ్యక్తి మా అమ్మగారు. నేను దర్శకుడు కావడానికి ఆమెనే కారణం. ఆమె పెంచిన తీరు క్రియేటివిటీ వైపు అడుగులు వేసేలా చేసింది. కామిక్స్ తో పాటు పలు పుస్తకాలు చదివేలా నన్ను ప్రోత్సహించారు.
ఇక నా భార్య రమ నా సక్సెస్ లో భాగమయ్యారు. ఆమె గొప్ప సలహాదారు. విమర్శకురాలు కూడాను. నచ్చని విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. రమ మంచి సలహాలు ఇవ్వడమే కాకుండా మోరల్ సప్పోర్ట్ ఇస్తారని రాజమౌళి వెల్లడించారు. ఇక మూడో వ్యక్తి ఆయన కూతురు మయూఖ అట. ఆమె అంటే రాజమౌళికి ఎంతో ప్రేమంట.కూతురు చెప్పిన మాటల్లా వింటారట. విచిత్రం ఏమిటంటే అమ్మతో పాటు భార్య చేతుల్లో కూడా రాజమౌళి దెబ్బలు తిన్నారట. రాజమౌళి తల్లి చిన్నప్పటి నుండి అనేక సందర్భాల్లో కొట్టారట.

తల్లి కాబట్టి కొడుకును కొట్టడంలో తప్పు లేదు. భార్య రమా కొట్టడమే ఇక్కడ అసలు విషయం. ఆ విషయాన్ని రాజమౌళి పబ్లిక్ లో చెప్పడం అతిపెద్ద సాహసం. ఏది ఏమైనా దర్శకుడిగా ఎవరూ చేరుకోలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించిన రాజమౌళి క్రెడిట్ తల్లి, భార్యా పిల్లలకు ఇవ్వడం గొప్ప విశేషం. ఆడవాళ్లకు ఆయన ఇచ్చే గౌరవం ఏమిటో దీంతో తెలుస్తుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్త్వం రాజమౌళిలో అణువణువునా కనిపిస్తుంది. నెక్స్ట్ ఆయన హీరో మహేష్ తో చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.