spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP BJP: బిజెపి చేతిలో ఏపీ రాజకీయం

AP BJP: బిజెపి చేతిలో ఏపీ రాజకీయం

AP BJP: ఏపీలో బిజెపి బలం అంతంత మాత్రం. కానీ రాజకీయాలను ప్రభావితం చేసేలా ఆ పార్టీ ఉంది. కేంద్రంలో అధికారంలో ఉండడమే అందుకు కారణం. గెలుపోటములను నిర్దేశించే స్థాయిలో ఆ పార్టీ ఉండడంతో.. తమకు ఏది ప్రయోజనం అనుకుంటే అలా వ్యవహరించేందుకు ఆ పార్టీ సన్నద్ధం అవుతోంది. సీట్లు, ఓట్లు పరంగా ఒక ఆలోచన కాగా.. రాజకీయ కోణంలో మరోలా ఆలోచిస్తోంది. అంతిమంగా సింహ ప్రయోజనాల వైపే భారతీయ జనతా పార్టీ మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే ఏపీలో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. బిజెపి కలిసి వస్తుందని భావిస్తోంది. బిజెపి నుంచి ఎటువంటి స్పష్టత లేదు. కానీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి. అయితే పొత్తులో భాగంగా బిజెపి 10 పార్లమెంట్ స్థానాలను అడుగుతోందని.. కానీ టిడిపి నుంచి ఐదు నుంచి ఏడు స్థానాలు ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని వార్తలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కు పార్లమెంట్ సీట్లు తగ్గుతాయని ఒక అంచనా ఉంది. ఈ తరుణంలో ఏపీ నుంచి వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బిజెపి నేతలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే వైసీపీతో రాజకీయ స్నేహం బిజెపికి కుదిరే పని కాదు. నేరుగా పొత్తు పెట్టుకోవడానికి కూడా వీలులేదు. ఏదైనా రాజకీయ పరస్పర సహకారం అందించుకోవడం వరకే కానీ.. నేరుగా కలిస్తే రెండు పార్టీలకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. అందుకే వైసిపి సైతం బిజెపి ఒంటరి పోరాటం చేయాలని భావిస్తోంది. అదే తమకు శ్రేయస్కరమని ఆలోచన చేస్తోంది. ఎన్నికల అనంతరం తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని బిజెపి నాయకత్వానికి జగన్ భరోసా ఇస్తున్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ చంద్రబాబుతో కలిస్తే మేలా? లేకుంటే జగన్ సలహా మేరకు ఒంటరి పోరాటం చేస్తే మేలా? అని ఆలోచిస్తున్నారు. కానీ గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబుతో కలిసి ఎందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదు. గత నాలుగు సంవత్సరాలుగా జగన్ అందించిన స్నేహాన్ని మాత్రం గుర్తు చేసుకుంటున్నారు. అయితే మారిన జాతీయ రాజకీయ పరిణామాల నేపథ్యంలో పొత్తులో భాగంగా ఐదు ఆరు పార్లమెంటు స్థానాలైనా వస్తాయని.. ఆపై చంద్రబాబును వదులుకుంటే ఇండియా కూటమి వైపు వెళ్లే అవకాశం ఉందని బిజెపి ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఏపీపై రాజకీయ పట్టు వదులుకోకూడదని బిజెపి భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం అనివార్యంగా మారడంతో.. సీరియస్ గా ఆ పార్టీ మేధో మధనం చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టతనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...

Dharmendra Pradhan Resignation: ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా.. స్టేజీపై కాక్రోచ్‌ల వికటట్టహాసం.. వైరల్‌ వీడియో

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలితం ఇచ్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూలై 25న తన పదవికి రాజీనామా...
Oktelugu Epaper
Exit mobile version