https://oktelugu.com/

ఏపీ రాజకీయం.. బీజేపీ వెయిట్ అండ్ సీ పాలసీ?

ఏపీలో మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందిన మరుక్షణం రాజకీయం వేడెక్కింది. చంద్రబాబు తొడగొట్టేసి జగన్ ప్రభుత్వానికి 48 గంటల డెడ్ లైన్ విధించాడు. రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లాలని.. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామంటున్నాడు. కానీ వైసీపీ మాత్రం చంద్రబాబు పని అయిపోయిందని.. అమరావతి భూ స్కాం కోసం ఉత్తరాంధ్ర, సీమను అన్యాయం చేస్తున్నారంటూ కౌంటర్ ఇస్తున్నాయి. Also Read: సీఎం జగన్ కు నిమ్మగడ్డ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడా? ఇక మరో ప్రతిపక్షం జనసేన మాత్రం ఎటూ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 4, 2020 / 07:51 PM IST
    Follow us on


    ఏపీలో మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందిన మరుక్షణం రాజకీయం వేడెక్కింది. చంద్రబాబు తొడగొట్టేసి జగన్ ప్రభుత్వానికి 48 గంటల డెడ్ లైన్ విధించాడు. రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లాలని.. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామంటున్నాడు. కానీ వైసీపీ మాత్రం చంద్రబాబు పని అయిపోయిందని.. అమరావతి భూ స్కాం కోసం ఉత్తరాంధ్ర, సీమను అన్యాయం చేస్తున్నారంటూ కౌంటర్ ఇస్తున్నాయి.

    Also Read: సీఎం జగన్ కు నిమ్మగడ్డ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడా?

    ఇక మరో ప్రతిపక్షం జనసేన మాత్రం ఎటూ తేల్చకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. ఆచితూచి స్పందిస్తోంది. అయితే బీజేపీ స్ట్రాటజీ మాత్రం అర్థం కాకుండా తయారైందని పరిణామాలను బట్టి తెలుస్తోంది.

    ప్రస్తుతానికి మూడు రాజధానులపై అటు సీఎం జగన్ కు మద్దతు ఇవ్వకుండా.. ఇటు చంద్రబాబులా వ్యతిరేకించకుండా వెయిట్ అండ్ సీ పాలసీని బీజేపీ అవలంబిస్తున్నట్టు పరిణామాలను బట్టి తెలుస్తోంది.

    టీడీపీని తొక్కేసి ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని బీజేపీ భావిస్తోంది. చంద్రబాబు పని అయిపోయిందని.. ఆ నేతలను లాగాలని చూస్తోంది. చంద్రబాబును వ్యతిరేకించే సోమువీర్రాజుకు అందుకే బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించిందని అంటారు. ఇప్పుడు జనసేనతో కలిసి బీజేపీ ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబులా వ్యతిరేకించకుండా అలానే.. అధికార వైసీపీకి సపోర్టు చేయకుండా పరిణామాలు గమనిస్తూ వెయిట్ అండ్ సీ పాలసీని అవలంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు మౌనం దాల్చాలని అంటున్నారు.

    Also Read: బాబుకు టీడీపీ నేతల ‘వెన్నుపోటు’!

    ఇప్పటికే బీజేపీలోని నేతలు కూడా ప్రాంతాల వారీగా మూడు రాజధానులపై విడిపోయారు. ఉత్తరాంధ, సీమ నేతలు మూడు రాజధానులను స్వాగతిస్తున్నారు. ఇక అమరావతి నేతలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ తేనెతుట్టెకు దూరంగానే బీజేపీ రాజకీయం చేస్తోదని చెప్పవచ్చు.

    -ఎన్నం