Homeజాతీయ వార్తలుఅక్కడ బీజేపీ ఆకర్ష్ మొదలెట్టిందా?

అక్కడ బీజేపీ ఆకర్ష్ మొదలెట్టిందా?


దేశంలో కరోనా తనపని తాను చేసుకుంటూ పోతుంది.. దీంతో పాజిటివ్ కేసులు సంఖ్య నిత్యం వేలల్లో నమోదువుతున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా రాజకీయ నేతలు మాత్రం ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి చేర్చుకుంటూ.. ప్రభుత్వాలను పడగొట్టేందుకు సిద్ధమవుతుండటం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలను కైవసం చేసుకుంటూ పోతుంది. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అసంతృప్తిని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంటుండటంతో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే కాంగ్రెస్ అధికారం కోల్పోగా బీజేపీ అధికారంలోకి వచ్చింది.

Also Read: బాబుకు టీడీపీ నేతల ‘వెన్నుపోటు’!

ఇటీవల రాజస్థాన్ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య నెలకొన్న వివాదాలు తారాస్థాయికి చేరడంతో కాంగ్రెస్ అధికారంలో కోల్పోయే స్థితికి చేరుకుంది. సచిన్ పైలట్ కు 19మంది కాంగ్రెస్ నేతలు మద్దతు ఇస్తున్నారు. వీరిని బీజేపీ తమవైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంది. అయితే సచిన్ పైలట్ బీజేపీలోకి వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో అక్కడి రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతోన్నాయి. అయితే బీజేపీ మాత్రం ఛాన్స్ దొరికితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

తాజాగా బీజేపీ మహారాష్ట్రలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో బీజేపీ మహారాష్ట్రలో ఆపరేషన్ లోటస్ చేపట్టి విఫలమైంది. మహారాష్ట్ర సీఎం ఉద్ధావ్ థాక్రేకు కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. అయితే ఎన్సీపీ పార్టీకి ఇచ్చిన గౌరవం కాంగ్రెస్ నేతలకు ఇవ్వడంలేదని థాక్రేపై కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారని సమాచారం. అలాగే మహారాష్ట్ర మంత్రి వర్గంలోనూ కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆరడజను నేతలు అసంతృప్తితో ఉన్నారట. ఈ విషయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

Also Read: రాజధానుల రాజకీయ రగడ మొదలైయింది

అయితే కాంగ్రెస్ నేతలను బీజేపీ తనవైపు ఆకర్షించేందుకు యత్నిస్తుంది. గతంలో బీజేపీ చేసిన తప్పు మరోసారి జరుగకూడదని అధిష్టానం భావిస్తోంది. దీంతో పక్కా ప్రణాళికతో ఈసారి మహారాష్ట్ర సర్కార్ ను కూలదోసేందుకు యత్నిస్తుందని ప్రచారం జరుగుతోంది. గతంలో ఎన్సీపీ నేత శరద్ పవర్ కు బీజేపీ గాలం వేయగా ఆయన శివసేనకు మద్దతు తెలుపడంతో ఆ ప్లాన్ బెడిసి కొట్టింది. దీంతో ఈసారి బీజేపీ శివనసేనతో సఖ్యత ఉంటూనే కాంగ్రెస్ నేతలను ఆకర్షిస్తోంది. బీజేపీ ఓవైపు శివసేనతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తానంటూ ఆఫర్ ఇస్తూనే మరోవైపు ప్రభుత్వాన్ని కూల్చేందుకు యత్నిస్తుందనే ప్రచారం జరుగుతోంది.

ఈ విషయంపై ఎన్సీపీ అధినేత శరద్ పవర్ తాజాగా స్పందిస్తూ బీజేపీ మహారాష్ట్ర సర్కార్ ను కూలదోసేందుకు యత్నిస్తుందంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో శివసేన అలర్ట్ అయింది. అయితే రానున్న మరో రెండు నెలల్లో మహారాష్ట్ర రాజకీయాలు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం కన్పిస్తోంది. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న సీఎం ఉద్ధవ్ థాక్రే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నుంచి ఎలా బయటపడుతారనేది ఆసక్తికరంగా మారింది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version