కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 25 నుంచి లాక్ డౌన్ కొనసాగుతుంది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు. చేసేందుకు పని లేక అవసరాలకు ఆదాయం లేఖ పేద, మధ్య తరగతి ప్రజలు అలాంటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూలీలకు, సంస్థల్లో పని చేసే సిబ్బందికి లాక్ డౌన్ లోను యధావిధిగా జీతాలు చెల్లించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను పట్టించుకునే వారే లేదు. మరోవైపు అవసరమైన పనులకు రోడ్లపైకి వచ్చిన వారి నుంచి పోలీసులు మాత్రం రూ.45 కోట్లు గుంజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పది రూపాయలు లేక అల్లాడే పరిస్థితిలో ఉన్న పేద, మధ్య తరగతి ప్రజల నుంచి ఎంత మొత్తం జరిమానాల రూపంలో వసూలు చేయడం విమర్శలకు తావిస్తోంది. సాధారణ రోజుల్లో పోలీసులు వారి టార్గెట్ లకు అనుకూలంగా కేసులు నమోదు చేసి జరిమానాలు వేసేవారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొన్ని చోట్ల పోలీసులు ఆర్ధిక భారం లేని శిక్షలు వేసి బయటకు రావద్దని హెచ్చరించారు. దీనిని ఎవరు తప్పు బట్టడం లేదు. జరిమానాల రూపంలో ఆర్థిక భారం వేయడం తగదంటున్నారు.
ఇప్పటి వరకు రాష్ట్ర పోలీస్ నిబంధనలను ఉల్లంఘించిన 9.76 లక్షల పై కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లు 54 వేల నమోదు చేయగా, నిబంధనలు ఉల్లంఘించిన 17 వేల మందిని అరెస్ట్ చేశారు. 58 వేల వాహనాలను సీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వాహనాలకు కలిపి రూ. 43 కోట్లు జరిమానా రూపంలో వసూలు చేశారు.
పోలీసు నిబంధనలు ఉల్లంఘించిన వారిలో ఏపీలో అరెస్ట్లు ఎక్కువగా విజయవాడ నగరంలోనే జరిగాయి. వాహనాలకు జరిమానా విధించడంలో ఏపీలో మొదటి స్థానంలో అనంతపురం జిల్లా నిలిచింది. కరోనా వైరస్ నివారించలంటే ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలి బయటకు రావద్దంటున్న ఏపీ పోలీసులు సూచిస్తున్నారు.