
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ” తొలి ప్రేమ ” సినిమా చూసి ఆయనకు అభిమానులుగా మారిన వాళ్లలో హీరో నితిన్ కూడా ఉన్నాడు. అంతేకాదు మొదటి నుంచి కూడా తాను పవన్ కల్యాణ్ కి తాను వీరాభిమానినంటూ చెప్పుకుంటూ రావడమే కాదు దాన్ని చాలా సార్లు బహిరంగ పరిచాడు కూడా.. అంతేకాదు తరచుగా తన సినిమాల్లో ఏదో ఒక చోట పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకొస్తుంటాడు. అలాంటి నితిన్ తన కారణంగా తన గురువు పవన్ కళ్యాణ్ కి తన ద్వారా వచ్చిన నష్టాన్ని భర్తీ చేయడానికి పూనుకొన్నాడని తెలుస్తోంది.
ఇంతకీ విషయం ఏమిటంటే గతంలో తన శ్రేష్ఠ మూవీస్ బ్యానర్లో నితిన్ ‘ఛల్ మోహన్ రంగా’ సినిమా చేయడం జరిగింది. కాగా ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కల్యాణ్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. అయితే ఆ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకొకపోవడం వలన నష్టాలు బాగానే వచ్చాయి. అయితే తన కారణంగా తన గురువు పవన్ కళ్యాణ్ కి వచ్చిన నష్టాన్ని భర్తీ చేయాలని నితిన్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తను చేస్తున్న రెండు సినిమాల్లో ఒక సినిమాకి పవన్ కళ్యాణ్ బ్యానర్ పేరును వాడుకుని, లాభాల్లో ఆయనకి వాటా ఇవ్వాలని అనుకొంటున్నాడట ..