AP Ministers: కేటాయించిన ఇళ్లను ఖాళీ చేస్తున్న ఏపీ మంత్రులు

AP Ministers: ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణ పనులు శరవేగంగా సాగతుండటంతో తమ పదవులు ఊడటం ఖాయమనుకున్న వారందరు వారి నివాసాలను ఖాళీ చేస్తున్నారు. ఈనెల 11న మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు కావడంతో ప్రస్తుతం పదవుల్లో ఉన్న వారు తమ అధికారిక నివాసాలు విడిచిపెట్టేందుు సిద్ధమయ్యారు. మంత్రులు తమ నివాసాల్లో ఉన్నది తక్కువే. సొంత నివాసాల్లోనే ఉంటూ తమ విధులు నిర్వహించారు. కానీ ఇప్పుడు అందరి పదవులు పోవడం ఖాయంగా కనిపిస్తుండటంతో ముందే ఇళ్లు ఖాళీ […]

Written By: Srinivas, Updated On : April 7, 2022 11:23 am
Follow us on

AP Ministers: ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణ పనులు శరవేగంగా సాగతుండటంతో తమ పదవులు ఊడటం ఖాయమనుకున్న వారందరు వారి నివాసాలను ఖాళీ చేస్తున్నారు. ఈనెల 11న మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు కావడంతో ప్రస్తుతం పదవుల్లో ఉన్న వారు తమ అధికారిక నివాసాలు విడిచిపెట్టేందుు సిద్ధమయ్యారు. మంత్రులు తమ నివాసాల్లో ఉన్నది తక్కువే. సొంత నివాసాల్లోనే ఉంటూ తమ విధులు నిర్వహించారు. కానీ ఇప్పుడు అందరి పదవులు పోవడం ఖాయంగా కనిపిస్తుండటంతో ముందే ఇళ్లు ఖాళీ చేస్తున్నారు.

AP Ministers

గత ప్రభుత్వం మంగళగిరి, విజయవాడ, రెయిన్ ట్రీ పార్క్ ప్రాంతాల్లో మంత్రులకు నివాసాలు ఏర్పాటు చేసింది. మంత్రులంతా ఇళ్ల ఖాళీ చేసి తమ సామన్లు తీసుకెళ్తున్నారు. పదవులు పోవడం తెలియడంతో ఇళ్లు ఖాళీ చేసి వచ్చే వారికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉంచుతున్నారు. ఈనెల 11న మంత్రివర్గ విస్తరణ చేపట్టి కొత్త మంత్రులు కొలువుదీరనున్నట్లు తెలుస్తోంది. దీంతో వారికి నివాసాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

Also Read: ఇదేం ప్రస్టేషన్.. సొంతింటిని చక్కదిద్దుకోలేక నోరు పారేసుకుంటున్న అమాత్యుడు

ఇవాళ మంత్రివర్గ సమావేశం నిర్వహించి మంత్రుల నుంచి రాజీనామాలు తీసుకోనున్నారు. ఇక పదకొండున కొలువు దీరనున్న వారి జాబితా ముఖ్యమంత్రి జగన్ దగ్గర సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. కానీ వివరాలు మాత్రం బయటకు రాలేదు. దీంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. గతంలో టీడీపీ ప్రభుత్వం మంత్రులు, న్యాయమూర్తులకు విల్లాలను నిర్మించాలని భావించినా అది కుదరలేదు. మధ్యలోనే వదిలేశారు

సీఎం జగన్ సూచన మేరకే అందరు తమ నివాసాలను ఖాళీ చేస్తున్నారు. కొత్త వారికి ఇళ్లు కేటాయించేందుకు సిద్ధమవుతున్నారు. పదవి పోవడం ఖాయమని తెలియడంతోనే అందరు ముందస్తుగా తమ ఇళ్లను ఖాళీ చేస్తూ వెళ్లిపోతున్నారు. దీంతో కొత్త వారికి అధికారిక నివాసాలు రెడీ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించే వారినే జగన్ ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక మంత్రివర్గం కూర్పు ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.

Also Read: మంత్రివర్గ విస్తరణ ఎఫెక్ట్.. నిట్టనిలువునా చీలిన బొత్స కుటుంబం

Tags