https://oktelugu.com/

Anasuya Bharadwaj: ఆ విషయంలో నేను సిగ్గుపడను – అనసూయ

Anasuya Bharadwaj: సోషల్ మీడియాలో తన వయసు గురించి చెబుతూ వచ్చిన ఓ ఆర్టికల్‌ పై నటి అనసూయ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు మీడియా సంస్థకు చెందిన లేడీ జర్నలిస్టు.. అనసూయపై ఓ స్పెషల్ స్టోరీ రాశారు. అయితే అందులో అనసూయ వయసు 40 అని పేర్కొన్నారు. ఇద్దరు పిల్లలున్నా అందాల ఆరబోతకు సై అంటుందని వివరించారు. దీనిపై అనసూయ తీవ్రంగా స్పందించింది. తన వయసు 40 కాదని 36 ఏళ్లు అని […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : April 7, 2022 / 11:13 AM IST
    Follow us on

    Anasuya Bharadwaj: సోషల్ మీడియాలో తన వయసు గురించి చెబుతూ వచ్చిన ఓ ఆర్టికల్‌ పై నటి అనసూయ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు మీడియా సంస్థకు చెందిన లేడీ జర్నలిస్టు.. అనసూయపై ఓ స్పెషల్ స్టోరీ రాశారు. అయితే అందులో అనసూయ వయసు 40 అని పేర్కొన్నారు. ఇద్దరు పిల్లలున్నా అందాల ఆరబోతకు సై అంటుందని వివరించారు.

    Anasuya Bharadwaj

    దీనిపై అనసూయ తీవ్రంగా స్పందించింది. తన వయసు 40 కాదని 36 ఏళ్లు అని స్పష్టం చేసింది. అనసూయ మాటలోనే.. ‘నా వయసు 40 కాదు 36. నా వయసు చెప్పుకోవడానికి నేను సిగ్గుపడటం లేదు. కాబట్టి వార్తలు రాసేటప్పుడు కచ్చితమైన సమాచారాన్ని పద్ధతిగా ఇస్తే బాగుంటుంది. చెప్పే విషయాన్ని కాస్త మర్యాదపూర్వకంగా చెబితే బాగుంటుంది’ అని రాసుకొచ్చింది.

    Also Read:  సినీ తారల లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు

    మొత్తానికి మహిళా జర్నలిస్టుపై నటి అనసూయ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే.. మీడియా వ్యక్తులు వాస్తవాలు తెలుసుకుని రాస్తే బాగుంటుందని అసహనం వ్యక్తం చేసింది. మరి జర్నలిస్ట్ లు రాసిన ఆర్టికల్స్ తో పైకి వచ్చిన ఈ ముదురు భామ.. చివరకు జర్నలిస్టులనే తిట్టడం బాధాకరమైన విషయం. అసలు ఆనసూయ ఎవరు ? చిన్న యాంకర్.

    anasuya bharadwaj

    మేకప్ తీస్తే.. ఆమె ఏ పాటి అందగత్తో అందరికి తెలుసు. ఆమె ఫోటోలను ప్రమోట్ చేసి చేసి.. ఆమెను జనం పై రుద్ది రుద్ది చివరకు ఆమెను అందగత్తెగా మలిచారు మీడియా జనాలు. ఆమెను అంత మేలు చేసి.. చివరకు ఆమె చేతిలోనే బూతులు తిట్టించుకుంటున్నారు.

    Also Read:  పేరు లేద‌నే అల‌క‌బూనిన కేసీఆర్ః వివ‌ర‌ణ ఇచ్చిన జీయ‌ర్ స్వామి

    Tags