ఏపీ మంత్రి జయరాంపై మరో బాంబు పేల్చిన అయ్యన్న పాత్రుడు

ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం మరోసారి చిక్కుల్లో పడ్డారు. మరోసారి ఆయనను టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు టార్గెట్ చేశారు. ఇప్పటికే ఈఎస్ఐ స్కాం నిందితుడితో ఏపీ మంత్రి కుమారుడు ‘బెంజ్ కారును’ తీసుకున్నాడంటూ అయ్యన్న పాత్రుడు చేసిన విమర్శలు కలకలం రేపాయి. దీనిపై ఏపీ మంత్రి వివరణ ఇచ్చినా ఆ వేడి చల్లారలేదు. Also Read: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సీఎం జగన్ శుభవార్త..? ఇప్పుడు అదే ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాంపై అయ్యన్నపాత్రుడు మరో […]

Written By: NARESH, Updated On : October 6, 2020 6:11 pm
Follow us on

ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం మరోసారి చిక్కుల్లో పడ్డారు. మరోసారి ఆయనను టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు టార్గెట్ చేశారు. ఇప్పటికే ఈఎస్ఐ స్కాం నిందితుడితో ఏపీ మంత్రి కుమారుడు ‘బెంజ్ కారును’ తీసుకున్నాడంటూ అయ్యన్న పాత్రుడు చేసిన విమర్శలు కలకలం రేపాయి. దీనిపై ఏపీ మంత్రి వివరణ ఇచ్చినా ఆ వేడి చల్లారలేదు.

Also Read: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సీఎం జగన్ శుభవార్త..?

ఇప్పుడు అదే ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాంపై అయ్యన్నపాత్రుడు మరో బాంబు పేల్చారు. కర్నూలు జిల్లాలో ఏపీ మంత్రి జయరాం నాలుగు వందల ఎకరాలను తన కుటుంబ సభ్యులు, బినామీల పేరుతో సొంత దారుల నుంచి బెదిరించి లాక్కున్నారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. వాటిని తనఖా పెట్టి బ్యాంకుల నుంచి రుణం తీసుకునేందుకు ప్రయత్నించారని ఆయన కొన్ని పత్రాలు బయటపెట్టారు.

కొన్ని భూములను ప్లాటినా అనే కంపెనీ నుంచి కొనుగోలు చేశారని అయ్యన్న ఆరోపించారు. సేల్ డీడ్ లో చిత్రమైన విషయాలు ఉన్నాయని వివరించారు. నిబంధన ప్రకారం రిజిస్ట్రేషన్ జరగలేదన్నారు. రెండు లక్షలకు మించి నగదు వ్యవహారం జరగకూడదని.. రూ.52 లక్షల రూపాయలు సేల్ డీడ్ ఎలా నగదుగా మార్చారని అయ్యన్న ప్రశ్నించారు.

Also Read: మోడీతో జగన్.. ఏం ఏం చర్చించారంటే?

మంత్రి అయ్యాక జయరాం కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని అయ్యన్న ఆరోపించారు. ఆ భూములన్నీ ఎక్కువగా ప్లాటినా అనే కంపెనీకి సంబంధించినవి అన్నారు. మరికొన్ని రైతులవని పత్రాలు చూపించారు. ఇద్దరు సోదరుల భార్యలపైన రెండు వందల ఎకరాలకు పైగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. మిగతావి బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని అయ్యన్న రిజిస్ట్రేషన్ పత్రాలను మీడియాకు ముందు చూపించి విమర్శించారు.