https://oktelugu.com/

ఒకేసారి రెండు సినిమాలతో సీనియర్ హీరో !

సినిమా ఇండస్ట్రీలో అరవై ఏళ్ళు వచ్చినా ఇంకా హీరోయిన్లతో సాంగ్స్, మాస్ ఫైట్స్ చేయాలని ఆశ పడుతూ ఉంటారు మన హీరోలు. పైగా హిట్ ఉన్న హీరోకి ఉండే క్రేజ్ వేరు. కోట్లల్లో రెమ్యూనరేషన్.. ఎవ్వరికీ దక్కని గౌరవం.. అందుకే హీరోలు ఏజ్ ఆయిపోయినా ఇంకా హీరోలుగానే ఉండిపోవాలని బలంగా కోరుకుంటారు. సీనియర్ హీరో డా. రాజశేఖర్ కూడా హీరోగానే కొనసాగడానికి ఇంకా ముమ్మరంగా సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆ మధ్య వచ్చిన ‘గరుడవేగ’ సూపర్ హిట్ తో […]

Written By:
  • admin
  • , Updated On : October 6, 2020 / 04:45 PM IST
    Follow us on


    సినిమా ఇండస్ట్రీలో అరవై ఏళ్ళు వచ్చినా ఇంకా హీరోయిన్లతో సాంగ్స్, మాస్ ఫైట్స్ చేయాలని ఆశ పడుతూ ఉంటారు మన హీరోలు. పైగా హిట్ ఉన్న హీరోకి ఉండే క్రేజ్ వేరు. కోట్లల్లో రెమ్యూనరేషన్.. ఎవ్వరికీ దక్కని గౌరవం.. అందుకే హీరోలు ఏజ్ ఆయిపోయినా ఇంకా హీరోలుగానే ఉండిపోవాలని బలంగా కోరుకుంటారు. సీనియర్ హీరో డా. రాజశేఖర్ కూడా హీరోగానే కొనసాగడానికి ఇంకా ముమ్మరంగా సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆ మధ్య వచ్చిన ‘గరుడవేగ’ సూపర్ హిట్ తో పూర్తిగా పోయిన మార్కెట్ మళ్లీ తిరిగి వచ్చింది. దీనికితోడు తెలుగు ప్రేక్షుకులు కూడా రాజశేఖర్ లో ఇంకా హీరోయిజమ్ ఉందని ఆ సినిమాతో ఆదరించారు. ఆ తరువాత చేసిన కల్కికి కూడా మంచి ఓపెనింగ్స్ నే వచ్చాయి. సినిమాకి బ్యాడ్ టాక్ వచ్చినా జనం ఆ సినిమాని బాగానే చూశారు.

    Also Read: మహేష్ బాబునే ఇంతలా భయపెట్టారంటే?

    ఇప్పుడు అదే ఊపుతో రాజశేఖర్ రెండు కొత్త సినిమాలను స్టార్ట్ చేయబోతున్నాడు. ‘పూలరంగడు, అహన పెళ్ళంట’ చిత్రాల డైరెక్టర్ వీరభద్రం చౌదరి దర్శకత్వంలో సరికొత్త తరహా కథాంశంతో ఓ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలో రాజశేఖర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా షూటింగ్ రేపటి నుండి అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదలుకానుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో ఈ సినిమాలోని రాజశేఖర్ పై వచ్చే కీలకమైన సన్నివేశాలను షూట్ చేయనున్నారని సమాచారం. ఎమోషనల్ గా సాగే ఆ సన్నివేశాల్లో రాజశేఖర్ తో పాటు మిగిలిన నటీనటులందరూ కూడా పాల్గొనబోతున్నారు. అన్నట్టు ఈ సినిమాలో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక రాజశేఖర్ కూడా నటిస్తోంది. రాజశేఖర్ పాత్రకు మరియు శివాత్మిక పాత్రకు మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ సినిమా మొత్తంలోనే హైలైట్ గా ఉంటాయట.

    Also Read: బిగ్‌ బాస్‌ కు నాగార్జున దూరం.. ఏం జరుగనుంది?

    కాగా ఈ సినిమాకు ఇంగ్లీష్ సినిమా ‘టోకెన్’ ప్రేరణ అట, ఆ సినిమాలోని మెయిన్ పాయింట్ ఆధారంగానే ఈ చిత్రం స్క్రిప్ట్ రాసుకున్నారట. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి. అలాగే రాజశేఖర్ మరో సినిమాని కూడా నవంబర్ సెకండ్ వీక్ నుండి స్టార్ట్ చేయనున్నాడు. శ్రీనువైట్ల దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన వినయ్ అనే కొత్త డైరెక్టర్ చెప్పిన కథ రాజశేఖర్ కు బాగా నచ్చిందట. ఈ సినిమాలో రాజశేఖర్ ఎమ్మెల్యేగా నటించబోతునట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తిగా పొలిటికల్ సెటైర్ గా ఉండబోతుందట. ప్రస్తుతం రాజశేఖర్ ఈ సినిమాల పైనే చాల సీరియస్ గా దృష్టి పెట్టాడు. మరి ఈ సినిమాల్లో ఒక్క సినిమా హిట్ అయినా ఈ సీనియర్ హీరో మరో నాలుగేళ్లు హీరోగా కొనసాగుతాడు.