ఏపీ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. ఫీజులు రద్దు చేసిన జగన్ సర్కార్..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ బోర్డు పరిధిలోని వివిధ ఫీజులను రద్దు చేస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. కరోనా వైరస్ విజృంభణ వల్ల ప్రభుత్వం ఈ ఏడాది రీ అడ్మిషన్, భాష, గ్రూప్, మీడియం మార్పుకు సంబంధించిన ఫీజులను రద్దు చేసింది. Also Read: నిరుద్యోగులకు […]

Written By: Navya, Updated On : December 15, 2020 11:17 am
Follow us on

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ బోర్డు పరిధిలోని వివిధ ఫీజులను రద్దు చేస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. కరోనా వైరస్ విజృంభణ వల్ల ప్రభుత్వం ఈ ఏడాది రీ అడ్మిషన్, భాష, గ్రూప్, మీడియం మార్పుకు సంబంధించిన ఫీజులను రద్దు చేసింది.

Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు..?

ఇంటర్ బోర్డ్ నుంచి రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఇప్పటికే ఈ మేరకు ఆదేశాలు అందాయి. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావడం వల్ల ఇకపై కాలేజీలు ఈ ఫీజులు వసూలు చేయకూడదు. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఏ కాలేజీ అయినా ఫీజులు వసూలు చేస్తే విద్యాశాఖ అధికారులు సదరు కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఈ నిర్ణయం వల్ల జగన్ సర్కార్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఫీజులకు సంబంధించిన ఒత్తిడి తగ్గుతుందని భావిస్తోంది.

Also Read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. అంగ‌న్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..?

కరోనా విజృంభణ వల్ల ప్రభుత్వం ప్రజలపై భారం తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వల్ల ఇంటర్ విద్యార్థులు వారికి నచ్చిన విధంగా రీ అడ్మిషన్, మీడియం, గ్రూప్ లను మార్చుకునే అవకాశం పొందవచ్చు. ఇంటర్ విద్యార్థులకు వెసులుబాటు కల్పించేలా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని: విద్య / ఉద్యోగాలు కోసం

2020 – 2021 విద్యాసంవత్సరానికి ఇంటర్ విద్యార్థులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. అయితే ఇప్పటికే ఫీజును చెల్లించి ఉంటే మాత్రం ఆ ఫీజును వెనక్కు పొందలేరు. కాలేజీలు విద్యార్థుల రీఅడ్మిషన్, మీడియం మార్పు, గ్రూపుల మార్పు కోసం 600 రూపాయల నుంచి 1,000 రూపాయలు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల విద్యార్థులు ఉచితంగా మీడియం, గ్రూపులను మార్చుకోవచ్చు.