ఏపీ పోలీస్‌ బాస్‌కు జస్ట్‌ మిస్‌..! : లేదంటే అదే జరిగేది

ఏపీ పోలీస్‌ బాస్‌ గౌతం సవాంగ్‌కు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ తృటిలో మిస్‌ అయింది. ప్రభుత్వ న్యాయవాది న్యాయమూర్తిని బతిమలాడి..హామీ ఇవ్వడంతో ఆ వారెంట్ జారీ కాస్త ఆగిపోయింది. కోర్టు రూల్స్‌, చట్టాలను ఉల్లంఘించే వారికి జారీ అయ్యే నాన్ బెయిలబుల్ వారెంట్‌ను హైకోర్టు ఏకంగా డీజీపీకే జారీ చేయాలనుకుందంటే.. ఆయన ఎంత తప్పిదానికి పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చు. ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ను గతంలో హైకోర్టు తమ ఎదుట కావాలని ఆదేశించింది. ఓ ఎస్‌ఐకి […]

Written By: Srinivas, Updated On : January 26, 2021 12:11 pm
Follow us on


ఏపీ పోలీస్‌ బాస్‌ గౌతం సవాంగ్‌కు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ తృటిలో మిస్‌ అయింది. ప్రభుత్వ న్యాయవాది న్యాయమూర్తిని బతిమలాడి..హామీ ఇవ్వడంతో ఆ వారెంట్ జారీ కాస్త ఆగిపోయింది. కోర్టు రూల్స్‌, చట్టాలను ఉల్లంఘించే వారికి జారీ అయ్యే నాన్ బెయిలబుల్ వారెంట్‌ను హైకోర్టు ఏకంగా డీజీపీకే జారీ చేయాలనుకుందంటే.. ఆయన ఎంత తప్పిదానికి పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చు. ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ను గతంలో హైకోర్టు తమ ఎదుట కావాలని ఆదేశించింది. ఓ ఎస్‌ఐకి సీఐగా ప్రమోషన్ ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేదు. హైకోర్టు ఆదేశించినా ఇవ్వలేదు. దీంతో కోర్టు ధిక్కరణ కింద పిటిషన్‌పై విచారణలో ఆయన హైకోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.

Also Read: వారి వల్లే.. జగన్‌కు ఈ వైఫల్యాలా..!

ఈ కేసు నేపథ్యంలో ఈనెల 25న ఆయన హైకోర్టులో హాజరు కావాల్సి ఉంది. కానీ.. రాలేకపోతున్నానని ఓ లీవ్ లెటర్ లాంటిది రాసి పంపించారు. అయితే.. ఆ లీవ్ లెటర్‌లో చెప్పిన కారణమే హైకోర్టు న్యాయమూర్తులకు కోపం తెప్పించింది. తాను ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నానని అందుకే.. విచారణకు రాలేకపోతున్నానని చెప్పుకొచ్చారు. గౌతం సవాంగ్ లేఖ చూసి జడ్జిలకు చిర్రెత్తుకొచ్చింది. ఓ వైపు ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా.. ఎస్‌ఈసీకి సహకరించకుండా ఆయనతో సమావేశాలకు కూడా హాజరు కాకుండా ఉండటం కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అదే విషయాన్ని హైకోర్టు గుర్తు చేసి మండి పడింది. ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా.. కోర్టుకు డుమ్మా కొట్టడానికి ఆ కారణం చెప్పడమేమిటని ప్రశ్నించింది.

దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడానికి సిద్ధమయింది. అయితే 27వ తేదీన ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరవుతారని.. వారెంట్ జారీ చేయవద్దని ప్రభుత్వ లాయర్ కోరడంతో చివరికి అంగీకరించింది. 27న హైకోర్టుకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. రాజ్యాంగం ప్రకారం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత డీజీపీ.. ఎస్‌ఈసీ పరిధిలో ఉంటారు. అందుకే.. తాను నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల నిర్వహణకు సహకరించకపోయినా.. ఆ అడ్వాంటేజ్ వాడుకోవాలనుకున్నారు.

Also Read: కేటీఆర్‌‌ ఎట్టి పరిస్థితిలో సీఎం కాడంట..: రేవంత్‌ వ్యాఖ్యలు

కానీ.. కోర్టు మాత్రం దానికి చెక్‌ పెట్టింది. అయితే.. గౌతంసవాంగ్‌కు హైకోర్టు చీవాట్లు పెట్టడం ఇదే మొదటి సారే కాదు ఆయన డీజీపీ పదవి చేపట్టిన తర్వాత ఏపీలో రూల్ ఆఫ్ లా అమలు చేయలేకపోతున్నారని ఎన్నో సార్లు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చేతకాకపోతే రాజీనామా చేయాలని కూడా సలహా ఇచ్చింది. కానీ సవాంగ్ వాటిని పెద్దగా లెక్క చేయలేదు. ఇప్పుడు మరోసారి హైకోర్టు మొట్టి కాయలు వేసింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్