https://oktelugu.com/

మూవీ రివ్యూ: ‘జగమే తంత్రం’ ఎలా ఉందంటే?

కరోనా కల్లోలంలో సినిమాలన్నీ వాయిదా పడుతున్న వేళ పూర్తయిన సినిమాలకు ఓటీటీనే దిక్కవుతోంది. ఇప్పటికే తమిళ స్టార్ హీరో ‘సూర్య’ నటించిన ‘ఆకాశమే హద్దురా’ మూవీ రిలీజ్ అయ్యి గ్రాండ్ హిట్ అయ్యింది. ఇప్పుడు అదే ధైర్యంతో ధనుష్ హీరోగా యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు రూపొందించిన సినిమా ‘జగమే తంత్రం’. ఈ సినిమా తాజాగా నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘జగమే తంత్రం’ చిత్రం రివ్యూ చూద్దాం.. కథ ఏంటంటే? ధనుష్ తమిళనాడులోని […]

Written By:
  • NARESH
  • , Updated On : June 18, 2021 / 06:01 PM IST
    Follow us on

    కరోనా కల్లోలంలో సినిమాలన్నీ వాయిదా పడుతున్న వేళ పూర్తయిన సినిమాలకు ఓటీటీనే దిక్కవుతోంది. ఇప్పటికే తమిళ స్టార్ హీరో ‘సూర్య’ నటించిన ‘ఆకాశమే హద్దురా’ మూవీ రిలీజ్ అయ్యి గ్రాండ్ హిట్ అయ్యింది. ఇప్పుడు అదే ధైర్యంతో ధనుష్ హీరోగా యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు రూపొందించిన సినిమా ‘జగమే తంత్రం’. ఈ సినిమా తాజాగా నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘జగమే తంత్రం’ చిత్రం రివ్యూ చూద్దాం..

    కథ ఏంటంటే?
    ధనుష్ తమిళనాడులోని మధురై ప్రాంతంలో ఒక రౌడీగా ఉంటాడు. హత్యలు, సెటిల్ మెంట్లు చేసుకుంటూ బతుకుతుంటాడు. ఒక హత్య తర్వాత నెలరోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. అదే సమయంలో లండన్ కు చెందిన పీటర్ అనే మాఫియా డాన్ కింద ధనుష్ పనిచేయాల్సి వస్తుంది. ఆ డాన్ కు బద్ద శత్రువు యిన శివదాస్ పతనానికి హీరో ధనుష్ కారణమవుతాడు. దానివల్లే సురుళి ఊహించని ప్రమాదంలో పడతాడు. తాను చేసింది పెద్దతప్పని తెలుసుకుంటాడు. ఆ స్థితిలో సురుళి ఏం చేశాడన్నది అసలు కథ.

    విశ్లేషణ:
    రజినీకాంత్ కబాలి సినిమాను పోలి ఉండేలా ఆయన అల్లుడు ధనుష్ ‘జగమే తంత్రం’ మూవీ ఉంటుంది. కొంచెం మార్చి తీశారంతే.. ధనుష్ సినిమాలో ఎమోషన్ మిస్సయ్యాయని అంటున్నారు. పేరు గొప్ప ఊరు దిబ్బలా సినిమా ఉంటుందని చెబుతున్నారు.మంచి డైరెక్టర్ గా పేరున్న కార్తీక్ సుబ్బరాజ్ తన కెరీర్ లోనే అత్యంత బలహీనకథతో ఈ సినిమా తీశాడని అంటున్నారు.ఇందులో చెప్పుకోదగ్గ సన్నివేశం ఒక్కటంటే ఒక్కటి ఉండదని చెబుతున్నారు. కథకు స్క్రీన్ ప్లే పెద్ద మైనస్ అంటున్నారు. శ్రీలంక తమిళుల సమస్యను సరిగ్గా ఎలివేట్ చేయలేకపోయారు. ధనుష్ పర్ఫామెన్స్ ఆకట్టుకుంది.

    జగమే తంత్రం మూవీ ఆరంభంలో అదిరిపోయేలా తీసి చివరకు వచ్చేసరికి ఆశలు ఆవిరయ్యేలా తీశాడని అంటున్నారు. ఒక వీధి రౌడీ లండన్ మాఫియా డాన్ చేరదీసి అక్కడి సామ్రాజ్యాన్ని కూల్చడం ఏమాత్రం నమ్మశక్యంగానీ రీతిలో ఉందని అంటున్నారు.

    కొంచెం భిన్నమైన కథాకథనం ఎంచుకుంటే సినిమా మరో లెవల్ లో ఉండేది. కానీ భారీతనం ఉన్న కథను ఎంచుకొని ఆ కథకు పూర్తి న్యాయం చేయకపోవడమే ఈ సినిమా ఫ్లాప్ అయ్యిందని చెప్పకతప్పదు. దర్శకుడు కార్తీక్ కథను నత్తకు నడకనేర్పించేలా మరీ స్లోగా నడపడమే పెద్ద సమస్యగా మారింది. దీంతో చూసిన ప్రేక్షకులు దీనిపై పెదవి విరుస్తున్నారు.

    oktelugu.com రేటింగ్ 2/5